Webdunia - Bharat's app for daily news and videos

Install App

మునుగోడు ఉప ఎన్నిక పోరు : ప్రారంభమైన పోలింగ్

Webdunia
గురువారం, 3 నవంబరు 2022 (08:46 IST)
నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం నుంచి ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు మొదలైన ఈ పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఓ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్య కోమటిరెడ్డి లగడపాటి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఈ ఉప పోరు అనివార్యమైన విషయం తెల్సిందే. ఇందులో మొత్తం 241855 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 
 
వీరిలో 50 మంది సర్వీస్ ఓటర్లు కాగా, 80 యేళ్లు పైబడిన వారు 2,576 మంది ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు 5,686 మంది ఉండగా, 730 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 298 పోలింగ్ కేంద్రాలను ఏర్పటాు చేశారు. వీటిలో 105 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ బూత్‌లుగా గుర్తించారు. 
 
కాగా, ఎన్నికలో అధికార తెరాస, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు బీఎస్పీ, టీజేఎస్‌లకు చెందిన మొత్తం 47 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఉప ఎన్నిక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ సంఖ్యలో పోలీసులను మొహరించారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments