Webdunia - Bharat's app for daily news and videos

Install App

మృగశిర కార్తె.. ఈ రోజు చేపలు తినాల్సిందే.. క్యూ కడుతున్న జనం

Webdunia
మంగళవారం, 8 జూన్ 2021 (10:07 IST)
తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు చేపల మార్కెట్ వద్ద జనం క్యూ కడుతున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. ఇవాళ 'మృగశిర కార్తె'. ఈ రోజు చేపలు తింటే ఆరోగ్యంగా ఉంటామని ప్రజలు భావిస్తారు. అందుకే ఈ రోజలు చేపలు తింటారు. ఈ రోజు మృగశిర కార్తె కావడంతో తెలుగు రాష్ట్రాల్లో చేపల మార్కెట్లు జనాలతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ రామ్ నగర్ చేపల మార్కెట్ అయితే తెల్లవారు జాము నుంచే ప్రజలు బారులు తీరారు. 
 
27 నక్షత్రాల్లోకి ఈ రోజు సూర్యుడి ప్రవేశం జరుగుతుంది. ఇలా జరగడాన్ని 'మృగశిర కార్తె'గా పిలుపుకుంటారు. అంతేకాదు ఈ కార్తె ప్రారంభంలో నైరుతీ రుతుపవనాలు ప్రవేశిస్తాయి. నిన్నటితో రోహిణీ కార్తె ముగిసింది. ఈ రోజు మృగశిర కార్తె ప్రారంభంకావడంతో తొలకరి వర్షాలు కురుస్తాయి. దీంతో రైతులు ఏరువాక లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. నాగళ్లతో పొలాలను దున్ని పంటలు వేస్తారు.
 
ఈ కార్తె సందర్భంగా చేపలు తినడం అనాధిగా వస్తున్న సంప్రదాయం. వేసవి కాలం తర్వాత వాతావరణం చల్లబడుతుంది. వేడిగా ఉండే చేపలను తింటారు. ఇలా చేపలు తినడం వల్ల గుండె జబ్బులు, ఆస్తమా వంటి రోగులు నయం అవుతాయని నమ్మకం. జ్వరం, జలుబు, దగ్గు వంటి రోగాలు కూడా తగ్గుతాయని అంటారు. అందుకే మృగశిర కార్తె రాగానే ప్రజలందరూ చేపలు తినేందుకు మరింత ఆసక్తి చూపుతారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments