Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రైవేటీకరణ దిశగా భారతీయ స్టేట్ బ్యాంకు? - సెంట్రల్ బ్యాంక్ - ఐవోబీ కూడా...

Webdunia
మంగళవారం, 8 జూన్ 2021 (08:56 IST)
కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తోంది. చివరకు భారతీయ రైల్వేల్లో కూడా ప్రైవేటీకరణను చొప్పించిందిం. ఇపుడు దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థగా ఉన్న భారతీయ స్టేట్ బ్యాంకును కూడా ప్రైవేటీకరించాలని భావిస్తోంది. ఇప్పటికే ఫిబ్రవరిలో పార్లమెంట్ బడ్జె్ట్ సమావేశాల సందర్భంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 
 
అలాగే, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లలో వాటాను విక్రయించాలని యోచిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్ ప్రకటించారు. తాజాగా బ్యాంక్ ఆఫ్ ఇండియాను కూడా ప్రైవేటీకరించబోతున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ బ్యాంకులోని ప్రభుత్వ వాటాను కూడా విక్రయించాలని కేంద్రం భావిస్తోందంటూ ప్రచారం జరుగుతోంది. అదే జరిగిందే.. ఎస్‌బిఐ కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతుంది.
 
జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. ప్రైవేటీకరణకు సంబంధించి నీతి ఆయోగ్ రెండు బ్యాంకుల పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఇప్పుడు ఆ జాబితాలో బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరును కూడా చేర్చినట్లు కథనాలు వస్తున్నాయి.
 
ఇప్పటికే కొన్ని బ్యాంకులను విలీనం చేయగా.. విలీనం చేయని, పెద్ద బ్యాంకులపై నీతి ఆయోగ్ దృష్టి పెట్టింది. ముఖ్యంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ బ్యాంక్, సింధ్ బ్యాంక్, యుకో బ్యాంక్ ఈ ప్రైవేటీకరణ జాబితాలో ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments