Webdunia - Bharat's app for daily news and videos

Install App

పైలెట్ ఆశయం: ఆటో డ్రైవర్ కుమార్తెకు అండగా నిలిచిన కాంగ్రెస్ ఎంపీ

Webdunia
శనివారం, 1 జనవరి 2022 (20:14 IST)
కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి ఓ ఆటో డ్రైవర్ కుమార్తెకు అండగా నిలిచాడు. పైలెట్ కోర్సు ఖర్చు కోసం తంటాలు పడిన ఓ ఆటో డ్రైవర్ కుమార్తె ఆశయానికి తన వంతు సాయం అందించారు.

వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లాకు చెందిన బోడా అమృతవర్షిణి పేద కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆమె తండ్రి ఓ ఆటోడ్రైవర్. కానీ ఆమె పైలట్ కావాలనుకుంది. అందుకు తగినట్లుగానే తెలంగాణ ఏవియేషన్ అకాడమీలో ట్రైనీ పైలెట్‌గా అడ్మిషన్ సాధించింది.
 
ఫీజుల రూపంలో ఖర్చులు చాలా ఉండడంతో అమృతవర్షిణి ఆర్థికసాయం కోసం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని సంప్రదించింది. ఆయన ఎంతో ఉదారంగా స్పందించి, ఆమె కోర్సుకు అయ్యే మొత్తం ఖర్చును తాను భరిస్తానని మాటిచ్చారు. ఇందులో భాగంగా రూ.2 లక్షల చెక్‌ను అందించారు.
 
దీనిపై కోమటిరెడ్డి స్పందిస్తూ... ఇలాంటి పేద కుటుంబాల నుంచి వచ్చిన ప్రతిభావంతులకు సాయపడేలా తెలంగాణ ప్రభుత్వం ఏ పథకం తీసుకురాకపోవడం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. ఓ ఆటోడ్రైవర్ కుమార్తె పైలెట్ అవడాన్ని గర్వంగా భావిస్తానని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sushant: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం హత్య కాదు.. ఆత్మహత్య.. కేసును క్లోజ్ చేసిన సీబీఐ

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments