'
సంథింగ్ స్పెషల్' షోతో యాంకర్‌గా తన కెరీర్ ని ప్రారంభించిన లాస్య.. ఇంజనీరింగ్ పూర్తిచేసింది. ఆ తరువాత అనుకోకుండా యాంకర్ అయ్యానని చెప్పింది. ఇక లాస్య తన భర్త మంజునాథ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే.
2010లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నా.. పెళ్లి తరువాత రెండు ఫ్యామిలీలు ఒప్పుకోకపోవడంతో చాలా ఇబ్బందులు పడి..మళ్ళీ ఇద్దరు కుటుంబ సభ్యులను ఒప్పించి మళ్లీ పెళ్లి చేసుకున్నారు ఈ జంట.
ఇక తాను యాంకర్‌గా చేసేటప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డానని చెప్పుకొచ్చిన లాస్య .. ఒకడు నన్ను పక్కలో పడుకోమని డైరెక్ట్ ఆఫర్ ఇచ్చాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అలా ఎంతోమందికి హీరోయిన్‌గా అవకాశం ఇచ్చానని చెప్పి తనతో అసభ్యంగా మాట్లాడాడని లాస్య చెప్పుకొచ్చింది.
కొన్ని ఈవెంట్స్ కోసం వెళ్లిన హీరోయిన్స్, యాంకర్స్ కూడా వ్యభిచారం చిక్కులో ఇరుక్కుంటున్నారని, యాంకర్ లాస్య కొన్ని సంచలన ఆరోపణలు చేసింది.