Webdunia - Bharat's app for daily news and videos

Install App

4 నుంచి తెలంగాణలో సినిమా థియేటర్లు

Webdunia
శనివారం, 28 నవంబరు 2020 (07:56 IST)
కరోనా కారణంగా మూతపడిన సినిమా థియేటర్లు తెలంగాణలో వచ్చే నెల 4 నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి. అదే రోజున ఓ ఇంగ్లిష్ సినిమా విడుదల కానుండడంతో సినిమా హాళ్లను తిరిగి తెరవాలని వాటి యజమానులు నిర్ణయించారు. మల్టీ‌ప్లెక్స్‌లు కూడా అదే రోజు తెరుచుకోనున్నాయి.

50 శాతం సామర్థ్యంతో థియేటర్లను తిరిగి తెరవవచ్చని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్న నేపథ్యంతో థియేటర్ యజమానులు ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. నాలుగు షోలే కాకుండా ఎక్కువ ఆటలు ప్రదర్శించుకోవచ్చని, టికెట్ల ధరలను పెంచుకోవచ్చంటూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రోత్సాహకాలు ప్రకటించింది. దీంతో యజమానులు ఆ దిశగానూ కసరత్తు ప్రారంభించారు.

తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.విజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. యజమానులు నడిపే థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు వచ్చే నెల 4న తెరుచుకుంటాయన్నారు. లీజులో ఉన్న థియేటర్లు మాత్రం పెద్ద సినిమాల విడుదల కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments