Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 13 April 2025
webdunia

తెలంగాణ పంచాయతీ కార్యాలయాల్లో వివాహ నమోదు

Advertiesment
Marriage registration
, శుక్రవారం, 6 నవంబరు 2020 (08:36 IST)
పెండ్లి జరిగిన రోజు నుంచి 30 రోజుల్లోగా గ్రామ పంచాయతీలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.దీని కోసం రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. 30 రోజుల నుంచి 60 రోజుల్లోపు నమోదు చేసుకుంటే రూ.100 రుసుం చెల్లించాల్సి ఉంటుంది. మూడు నెలలు దాటిటే రూ.1,000 చెల్లించాల్సి ఉంటుంది.

రూ.500 చెల్లిస్తే అధికారులు మీ ఇంటికి వచ్చి వివాహ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను చేపడుతారు.గతంలో పంచాయతీ కార్యదర్శుల కొరత ఉండడంతో ఒక్కొక్కరికీ మూడు నాలుగు పంచాయతీల బాధ్యతలను చేపట్టారు.

కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం పంచాయతీలన్నింటికీ కార్యదర్శులను ఉండాలనే నిబంధన ఉండడంతో అన్ని పంచాయతీలకు పూర్తిస్థాయిలో కార్యదర్శులను నియమించింది. ప్రతి పంచాయతీకి ఒక కార్యదర్శి అందుబాటులో ఉండడంతో ప్రభుత్వం వివాహ రిజిస్ట్రేషన్‌ నమోదు తప్పని సరి చేసింది.
 
వివాహ రిజిస్ట్రేషన్‌తో అనేక ఉపయోగాలు
వివాహానికి చట్టబద్ధత, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల కింద ఆర్థిక సహాయం, భర్త చనిపోతే వితంతు పింఛన్‌, భర్త నుంచి విడిపోయే సందర్భాల్లో  భరణం పొందేందుకు అవకాశం ఉంటుంది, బాల్య వివాహాల నిర్మూలన, రెండో వివాహాన్ని అడ్డుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రేమ పేరిట మోసాలు, రహస్య పెండ్లిలు, రుజువు లేని వివాహాల రద్దు చేయడానికి అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగాలకు వెళ్లే వారికి భార్యాభర్తలుగా పరిగణించబడుతారు.

మూడు పద్దతుల్లో వివాహ నమోదు..!
వివాహాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రభుత్వం మూడు పద్దతులను పాటించాలని ఆదేశించింది. నూతన విధానంలో వధూవరులకు వివాహ మెమోరాండం అందజేసి పూర్తి వివరాలను రిజిష్టర్‌లో నమోదు చేయాలి. ఇందు కోసం ఆధార్‌కార్డు, పెళ్లి శుభలేఖ, పెళ్లి ఫోటోలు, ముగ్గురు సాక్షుల సంతకాలు తీసుకున్న తర్వాత వారికి వివాహా ధృవపత్రం అందచేస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముహూర్తం ఖరారు!