బీజేపీకి మోత్కుపల్లి రాజీనామా: కేసీఆర్ మరో అంబేద్కర్‌గా మిగిలిపోతారు

Webdunia
శుక్రవారం, 23 జులై 2021 (13:19 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు ప్రశంసల వర్షం కురిపించారు. బీజేపీకి రాజీనామా చేసిన సందర్భంగా మోత్కుపల్లి మీడియాతో మాట్లాడారు. దళితుల సంక్షేమం కోసం దళిత బంధు పథకం అమలుకు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందన్నారు.

దళితుల గుండెల్లో అంబేద్కర్ వారసుడిగా కేసీఆర్ మిగిలిపోతారు. దళిత బంధును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. దళితులందరూ సీఎం కేసీఆర్ అండగా నిలబడి హుజురాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి. ప్రతి ఊరు, ప్రతి వాడలో దళిత బంధు పథకంపై అవగాహన కల్పించేందుకు దండోరా వేయాలన్నారు. ఈ సందర్భంగా మోత్కుపల్లి దరువు వేశారు. 
 
సీఎం కేసీఆర్‌పై విశ్వాసంతోనే బీజేపీకి రాజీనామా చేశాను అని మోత్కుపల్లి నర్సింహులు స్పష్టం చేశారు. ఈ దేశంలో దళితులు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నారు. దళితులను గౌరవించాల్సిన అవసరం ఉంది. దళిత బంధు గురించి సీఎం కేసీఆర్ స్వయంగా తనకు ఫోన్ చేసి చెప్పారు.

దళిత బంధు కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం తప్ప దేశంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టే ధైర్యం చేయలేదు. రైతుబంధు మాదిరిగా దళిత బంధును దళితుల ఖాతాల్లో వేస్తామని సీఎం కేసీఆర్ మాటిచ్చారు. ఒక్కో దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు ఇస్తున్న మొనగాడు కేసీఆర్ మాత్రమే అని నర్సింహులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

హైదరాబాద్ సీపీ సజ్జనార్‌పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments