Webdunia - Bharat's app for daily news and videos

Install App

తనకు న్యాయం చేయాలని కూతురితో కలిసి తల్లి భిక్షాటన

Webdunia
సోమవారం, 14 సెప్టెంబరు 2020 (18:02 IST)
తనకు జరిగన అన్యాయాన్ని నిరసిస్తూ ఓ తల్లి తన కన్న కూతురితో కలిసి భిక్షాటన చేసింది. ఆర్మీ ఉద్యోగం చేస్తూ భర్త పట్టించుకోకపోగా తన పేరిట ఉన్న భూమిని అత్త, బావలు అక్రమంగా పట్టా చేసుకున్నారు. అది సహించలేని ఆ మహిళ ఏంచేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితిల్లో భిక్షాటన చేస్తూ నిరసన చేసింది.
 
ఆ తర్వాత గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు తన కూతురితో ధర్నా చేసింది. ఈ సంఘటన వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లెలో చోటుచేసుకున్నది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. 15 ఏళ్ల క్రితం తీగరాజు పల్లె గ్రామానికి చెందిన రంరాజు అమరావతికి, మదుసూదన్‌కు వివాహం జరిగింది.
 
అయితే సదరు మహిళ తన భర్త, బావ, ఆడబిడ్డలపై కుటుంబ కలహాలతో 2012లో హన్మకొండలోని మహిళా పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసింది. దీంతో అక్కడి పోలీసులు వారందరి పైనా కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు కేసు నడుస్తూనే ఉంది. ఓవైపు తను పెట్టిన కేసులు విచారణలో ఉండగానే అత్త, బావ రంగరాజ్ సదరు బాధితురాలు పేరు మీద ఉన్న భూమిని వారి పేర రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
 
తర్వాత కొన్ని రోజులకే ఈ విషయం అమరావతికి తెలియడంతో వెంటనే ఆమె స్పందించి తనకు న్యాయం చేయాలంటూ తన కూతురితో కలిసి గ్రామంలో భిక్షాటన చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బాధితురాలికి కౌన్సిలింగ్ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments