నిజమే... మోడీ నోటీసులు వచ్చాయి : ఎమ్మెల్సీ కవిత

Webdunia
గురువారం, 14 సెప్టెంబరు 2023 (19:19 IST)
తనకు ఈడీ నోటీసులు వచ్చాయని వాటిని పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే కె.కవిత అన్నారు. ఈ నోటీసులను తాను ఈడీ నోటీసులుగా పరిగణించడం లేదని, మోడీ నోటీసులుగా భావిస్తున్నట్టు చెప్పారు. రాజకీయ కక్షతో వచ్చినా నోటీసులు కాబట్టి అంతగా స్పందించాల్సిన లేదని తెలిపారు. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ను టీవీ సీరియల్‌గా లాగుతున్నారని కవిత వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
 
ఈడీ పంపిన నోటీసులు నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, తనకు నోటీసులు వచ్చాయని, న్యాయ సలహా తీసుకుంటున్నామని తెలిపారు. రాజకీయ దురుద్దేశ్యంతో తనకు నోటీసులు వచ్చాయన్నారు. ఇవి రాజకీయ కక్షతో వచ్చిన నోటీసులు కాబట్టి అంతగా స్పందించాల్సిన అవసరం లేదని పెద్దగా ఆలోచించాల్సిన అవసరమూ లేదన్నారు. ఇపుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్లీ కొత్త ఎపిసోడ్‌ వచ్చిందన్నారు. 
 
సంవత్సరకాలంగా దీనిని టీవీ సీరియల్‌లా లాగుతున్నారని, కాబట్టి సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇవి ఈడీ నోటీసులు కాదని, మోదీ నోటీసులు అన్నారు. ఈడీ నోటీసులు నేపథ్యంలో తాను రేపు విచారణకు హాజరుకావడం లేదన్నారు. సుప్రీంకోర్టులో విచారణ తర్వాతే హాజరవుతానని స్పష్టం చేశారు. ఈ ఎపిసోడ్ ఇంకెంత కాలం కొనసాగుతుందో ఉండాలన్నారు. గతంలో 2జీ విచారణ చాలా కాలం సాగిస్తుందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలు కూడా దీనిని సీరియస్‌గా తీసుకోరన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chikiri Chikiri: మొన్న చిరుత ఓసోసి రాకాసికి.. నేడు చికిరి చికిరికి స్టెప్పులేసిన మహిళ (video)

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఎప్పుడో తెలుసా?

Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్

Dil Raju: లివ్ ఇన్ రిలేషన్.. కానీ పిల్లలు పుట్టడమే సమస్య : దిల్ రాజు

ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో ప్రీమియర్లకి అద్భుతమైన స్పందన : తిరువీర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments