Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూత వైద్యం పేరుతో బాలికకు మత్తు మందిచ్చి 3 నెలల పాటు..?

Webdunia
మంగళవారం, 13 అక్టోబరు 2020 (19:45 IST)
భూత వైద్యం పేరుతో ఓ దొంగబాబా మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతుండటంతో మహిళలు ఆ బాబాకు దేహశుద్ది చేశారు. వైద్యం పేరుతో 15 ఏళ్ల బాలికను లొంగదీసుకుని ఆమెకు మత్తుమందు ఇచ్చి మూడు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతుండటంతో ఆ దొంగబాబకు బడితపూజ చేశారు. ఈ ఘటన మంగళవారం నిజామాబాద్‌లో చోటు చేసుకుంది. 
 
అయితే కుటుంబ సమస్యల కారణంగా నిజామాబాద్‌కు చెందిన ప్రసాద్‌ అనే భూత వైద్యున్ని సదరు బాలిక సంప్రదించింది. సమస్య పరిష్కరిస్తానని అమాయకురాలైన బాలికను బెదిరించి లైంగికంగా వేధించడం మొదలు పెట్టాడు. అంతేకాకుండా బాలికకు మత్తుమందు ఇచ్చి మూడు నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక తెలిపింది.
 
ఈ క్రమంలో బాలికకు కడుపు నొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అసలు విషయం చెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు స్థానిక మహిళలతో కలిసి బాబాను తీవ్రంగా చితకబాదారు. ఇంకా పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దొంగబాబాను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం