Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీఆర్ఎస్ నేత ఇంట్లో పనిచేసే మైనర్ బాలిక గర్భం దాల్చింది.. కారణం ఎవరో?

Webdunia
గురువారం, 27 మే 2021 (14:53 IST)
మహిళలపై వయోబేధం లేకుండా అకృత్యాలు జరుగుతూనే వున్నాయి. తాజాగా జగిత్యాల జిల్లాలో ఓ మైనర్ బాలిక గర్భం దాల్చిన ఘటన కలకలం రేపుతోంది. ముఖ్యంగా జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రానికి చెందిన ఓ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధి ఇంట్లో పనిచేస్తున్న ఈ మైనర్ బాలిక ( 17 ) గర్భం దాల్చడం ప్రస్తుతం వివాదానికి దారితీసింది. ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లు సదరు ప్రజాప్రతినిధి ఇంట్లో తనిఖీలు చేపట్టి , బాలికను రెస్క్యూ చేశారు.
 
వివరాల్లోకి వెళితే... బాలిక కుటుంబం ఆ నాయకుడి ఇంటి పక్కనే చాలా సంవత్సరాలుగా నివాసముంటుంది . పక్కనే ఉన్న ఆ నాయకుని ఇంట్లో ఇంటి పనులు చేస్తోంది. మరోవైపు మొదట బాలిక సోదరి కూడ అదే ఇంట్లో ఇంటి పని చేసేది. ఆమె తర్వాత చెల్లెలు చేస్తోంది. అయితే ప్రజాప్రతినిధి అయి ఉండి మైనర్ బాలికను ఇంట్లో పనిలో పెట్టుకోవడంతో పాటు, ప్రస్తుతం ఆ చిన్నారి గర్భం దాల్చడం చర్చనీయాంశంగా మారింది. 
 
విషయం బయటికి రావడంతో బాలికను చేరదీసిన జిల్లా శిశు సంక్షేమ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గర్భానికి కారణం ఎవరో కనిపెట్టే పనిలో ఉన్నారు . ఇక ఈ కేసులో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధితో పాటు అదే ఇంట్లో ఉంటున్న డ్రైవర్ పైనా కూడ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. బాలిక వాగ్మూలం ఆధారంగా నిందితుడిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు వివరాలను బయటకు చెప్పడం లేదు. 
 
ప్రస్తుతం చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో ఉన్న బాలికను జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఉంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. పోలీసులు పోక్సో కింద కేసు నమోదు చేసి , దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ విషయమై డీఎస్పీ వెంకట రమణను వివరణ కోరగా, ఇది సున్నితమైన కేసు అయినందున ఇప్పుడే వివరాలు బయటకు చెప్పలేమంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

పుష్ప రాజ్, శ్రీవల్లి దీపావళి శుభాకాంక్షలతో పుష్ప2 అప్ డేట్

దీపావళి సందర్భంగా గేమ్ ఛేంజర్ టీజర్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

నార్త్ కరోలినా చాప్టర్‌ని ప్రారంభించిన నాట్స్

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments