Webdunia - Bharat's app for daily news and videos

Install App

లష్కర్ బోనాలకు సర్వం సిద్ధం... శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో...

Webdunia
శనివారం, 8 జులై 2023 (21:28 IST)
Talasani
లష్కర్ బోనాలకు సర్వం సిద్ధమైంది. సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయం పరిసరాల్లో పలు సూచనలు చేశారు. లష్కర్ బోనాలకు వివిధ శాఖల ఆధ్వర్యంలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. 
 
ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు అమ్మవారికి తొలిబోనం సమర్పించడం జరుగుతుందని తెలిపారు. బోనాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు వస్తుంటారని.. వారు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 
 
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే సీఎం కేసీఆర్ బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించారని గుర్తు చేశారు.
 
నాటి నుంచి సీఎం ఆదేశాల మేరకు ప్రతి ఏడాది సర్కారు అన్ని ఏర్పాట్లు చేస్తూ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుందన్నారు. ఇంకా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు మంత్రి తలసాని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిజమైన భారతీయుడు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్: ఎస్.జె సూర్య (Video)

రూ.1,000 కోట్ల క్లబ్‌కు చేరువలో ప్రభాస్ "కల్కి 2898 AD"

పిల్లల ఫోటోలు సోషల్ మీడియాలోనా.. పేరెంట్స్ అలెర్ట్: సాయి ధరమ్ తేజ్

ప్రభాస్‌కు పెళ్లి చేయాలని మాకూ వుంది.. కానీ టైం రావాలి: శ్యామలాదేవి

రాజ్ తరుణ్‌తో నాకెలాంటి సంబంధం లేదు.. హీరోయిన్ మాల్వి మల్హోత్రా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments