Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏక కణ జీవి అమీబా సోకి బ్రెయిన్ ఇన్ఫెక్షన్ : యువకుడి మృతి

rare brain infection
, శుక్రవారం, 7 జులై 2023 (18:32 IST)
కేరళ రాష్ట్రంలో ఒక విషాదకర ఘటన జరిగింది. స్వేచ్ఛగా జీవించే ఏక కణజీవి అమీబా కారణంగా కేరళ రాష్ట్రంలోని అళపుళాలో ఓ యుకుడికి బ్రెయిన్ ఫీవర్ సోకి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. అళపుళాలోని పానవల్లి తీర ప్రాంతానికి చెందిన 15 యేళ్ళ బాలుడు  ప్రైమరీ అమీబిక్ మెనింగ్ ఎన్సెఫాలిటిస్ అనే వ్యాధి బారినపడినట్టు చెప్పారు. బాలుడి మరణాన్ని ఆరోగ్య మంత్రి ధృవీకరించారు.
 
అదేవిధంగా గతంలో ఐదు అరుదైన ఇన్ఫెక్షన్ కేసులు నమోదైనట్టు తెలిపారు. తొలిసారిగా 2016లో అళపుళాలోని తిరుమల వార్డులో ఈ కేసులు నమోదైనట్టు తెలిపారు. మలప్పురంలోని 2019, 2020 సంవత్సరాల్లో రెండు కేసులు నమోదయ్యాయని, 2020లో కోళికోడ్, 2022లో త్రిసూర్‌లో ఒక కేసు నమోదైనట్టు ఆమె త్రిశూర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 
 
ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు జ్వరం, తలనొప్పి, వాంతులు. కాగా, ఈ వ్యాధి సోకిన వారంతా మృతి చెందినట్లు ఆరోగ్య మంత్రి చెప్పారు. తద్వారా ఈ అరుదైన బ్రెయిన్ ఇన్ఫెక్షన్ మరణాల రేటు 100 శాతంగా ఉంది. ఇన్ఫెక్షన్‌కు కారణమయ్యే అమీబా ఏక కణ జీవులు నిశ్చల నీటిలో కనిపిస్తాయని మంత్రి తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భవిష్యత్ మ్యూజియంలు, హెరిటేజ్ ల్యాండ్‌మార్క్‌ల నుండి దుబాయ్ గొప్ప ఇండోర్ అద్భుతాలను వీక్షించండి