Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి ప్రశాంత్​రెడ్డి.. ఎందుకబ్బా!?

Webdunia
బుధవారం, 11 సెప్టెంబరు 2019 (08:34 IST)
ముఖమంత్రి కేసీఆర్ రెండేళ్ల కాలంలోనే అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారని మంత్రి ప్రశాంత్​రెడ్డి తెలిపారు. శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు వరద కాలువ వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం రైతులతో ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ... మధ్యలో మంత్రి ప్రశాంత్​రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు.

రెండేళ్ల వ్యవధిలోనే కాళేశ్వరం నుంచి గోదావరి జలాలను శ్రీరాంసాగర్​కు తరలించామని మంత్రి ప్రశాంత్​రెడ్డి పేర్కొన్నారు. వరద నీటి మల్లింపు, వినియోగంలో... సీఎం కేసీఆర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నారని కొనియాడారు. నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద కాలువ వద్ద కాళేశ్వరం జలాలకు మంత్రి పూజలు చేశారు.

సీఎం కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. రైతులకు సాగు నీటి విషయంలో ఎన్ని కోట్లు ఖర్చయినా... వెనుకాడే ప్రసక్తి లేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రాజెక్టు గురించి ప్రస్తావిస్తూ... భావోద్వేగానికి గురయ్యారు.

ఈ ప్రాజెక్టు కోసం సీఎం కేసీఆర్​తో​ ఎంత కష్టపడ్డారో తనకు తెలుసునని... వందల మంది ఇంజినీర్లు ఆహోరాత్రులు నిద్రలేకుండా శ్రమించారని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments