Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

75 ఏళ్ళ వయసులో భార్యపై అనుమానం..ఏం చేశాడో చూడండి

Advertiesment
75 ఏళ్ళ వయసులో భార్యపై అనుమానం..ఏం చేశాడో చూడండి
, మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (20:00 IST)
75 ఏళ్ల వృద్ధాప్యంలోనూ భార్యపై అనుమానంతో భర్త చేసిన దారుణం సమాజాన్ని షాక్ కి గురి చేస్తుంది. కాటికి కాళ్ళు చాపిన వయసులో వృద్ధురాలైన భార్య వివాహేతర సంబంధం నడుపుతుందని అనుమానించి ఆమెను హత్య చేసిన సంఘటన వరంగల్ అర్బన్ జిల్లాలో సంచలనం రేపింది. భార్యను హతమార్చటమే కాకుండా తాను ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన వృద్ధుడిని ఆస్పత్రికి తరలించారు.
 
సంఘటన వివరాల్లోకి వెళితే... వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన 65 ఏళ్ల పల్నాటి చిలకమ్మను దారుణంగా హతమార్చాడు భర్త పల్నాటి బుచ్చయ్య. చిలకమ్మ బుచ్చయ్య దంపతులకు అయిదుగురు కుమార్తెలు ఒక కుమారుడు. అందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి.

ఇక మనవళ్లు మనవరాళ్లు కూడా పుట్టారు. అయితే ఇంత వయసు వచ్చినా బుచ్చయ్యకు భార్యపై అనుమానం మాత్రం పోలేదు. ఆమె ఎవరితో మాట్లాడిన వివాహేతర సంబంధాలు అంటగట్టి దూషించి తీవ్రంగా కొట్టేవాడు. చిలకమ్మ ఎటు వెళ్ళినా ఆమెతోపాటు వెళ్లేవాడు. ఇక పిల్లల ఇంటికి వెళ్లినా చిలకమ్మను సహించే వాడు కాదు. 
 
రోజురోజుకీ అనుమానం ఎక్కువై చిలకమ్మను హత్య చేసేందుకు రెండు సార్లు ప్రయత్నించాడు బుచ్చయ్య. ఓసారి ఇంటిముందు గొయ్యి తవ్వి అందులో వేసి హతమార్చాలని ప్రయత్నం చేశాడు. మరోమారు గ్యాస్ లీక్ చేసి చంపేయాలని చూశాడు.

ఇక ఈ విషయాన్ని కుమార్తెలు చెప్పారు. ఇక రెండు సార్లు బుచ్చయ్య ప్రయత్నం సఫలం కాకపోవడంతో చివరికి చిలకమ్మ నిద్రిస్తున్న సమయంలో కత్తితో దాడి చేశాడు. చిలకమ్మ గొంతుకోసి ప్రాణం తీశాడు. ప్రతిఘటించిన చిలకమ్మ తీవ్రంగా గాయపరిచాడు.
 
చిలకమ్మ చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత తాను ఆత్మహత్య యత్నం చేశాడు బుచ్చయ్య. చిలకమ్మ హత్యకేసు తనపై పడుతుందన్న భయంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. కానీ చనిపోయేందుకు ధైర్యం చాలక మళ్లీ మంటలను ఆర్పుకున్నాడు.

తిరిగి చిలకమ్మను హతమార్చిన కత్తితోనే గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు బుచ్చయ్య. ఇక అంతేనా ఈ ఘటన బయటకు పొక్కడంతో గుర్తుతెలియని వ్యక్తులు తన భార్యను చంపేసి తనపై దాడి చేశారని కట్టుకథ అన్నాడు. కుమార్తెలు, కుమారుడు, గ్రామస్తులు బుచ్చయ్య తీరుపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
గొంతు కోసుకుని గాయపడిన బుచ్చయ్య ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కుమార్తెలు, కుమారుడు ఇచ్చిన సమాచారంతో బుచ్చయ్య పై కేసు నమోదు చేసిన పోలీసులు బుచ్చయ్య వైద్య చికిత్స అనంతరం ఈ కేసును సమగ్రంగా విచారించనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ప్రతి ఏటా పదివేలు