Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అందుకే కేసీఆర్ కు భయం.. డీకే అరుణ

అందుకే కేసీఆర్ కు భయం.. డీకే అరుణ
, మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (08:24 IST)
కాంగ్రెస్, అధికార టీఆర్‌ఎస్‌ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత డీకే అరుణ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందన్నారు. కాంగ్రెస్ ఖేల్ ఖతమ్ అయిపోయినట్లేనని చెప్పుకొచ్చారు. 
 
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీయేనని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ పార్టీపై పోరాటం చేసేంది కేవలం బీజేపీ మాత్రమేనని డీకే అరుణ స్పష్ఠం చేశారు. టీఆర్ఎస్ పార్టీ ముసలం పుట్టిందని విమర్శించారు.  
 
టీఆర్ఎస్ లో ఓనర్ల ఇష్యూ నడుస్తోందని విమర్శించారు. ఈ ఓనర్ల గొడవ ఇక్కడితో ఆగిపోదని త్వరలోనే పెద్ద ప్రమాదంగా పరిగణించబోతుందని తెలిపారు. భయంతోనే కేసీఆర్‌ కేబినెట్‌లో ఇద్దరు మహిళలకు అవకాశం ఇచ్చారని ఆరోపించారు మాజీమంత్రి డీకే అరుణ.
 
ఇప్పటికైనా మంత్రులకు అధికారమివ్వండి: కోదండరాం
మంత్రులను బానిసలుగా, ఉత్సవ విగ్రహాలుగా మార్చొద్దని సీఎం కేసీఆర్‌కు టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం సూచించారు. తండ్రీకొడుకుతో పాటు మిగతా 16  మంది మంత్రులకు ఇప్పటినుంచైనా హక్కులు, అధికారాలిస్తే బాధ్యతగా పని చేస్తారన్నారు.

రాష్ట్ర కేబినెట్‌ కూర్పుపై కోదండరాం మాట్లాడారు. రెండోసారి టీఆర్ఎస్‌ అధికారంలోకి వచ్చిన 7 నెలల తర్వాత పూర్తి స్థాయిలో మంత్రివర్గం ఏర్పడటం, తొలిసారి మహిళలకు చోటు దక్కడం మినహా కూర్పులో విశేషమేం లేదన్నారు.

జన జీవితాన్ని ఆర్థిక మాంద్యం అల్లకల్లోలం చేయడం.. పార్టీలో, కుటుంబంలో ముదిరిన సంక్షోభం, దివాళా తీసిన ఖజానా, మరీ ముఖ్యంగా ఈటల, రసమయి లాంటి నేతలకు జరిగిన అవమానంపై పెల్లుబుకిన ప్రజాగ్రహం -నుంచి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నమే కేబినెట్ విస్తరణ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అన్నింటా తెలంగాణ నంబర్ వన్: గవర్నర్ సౌందరరాజన్