Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు పనులు ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Webdunia
గురువారం, 13 మే 2021 (15:09 IST)
నిర్మల్ పట్టణం గాజుల్ పెట్ నుండి ఆలూర్ గ్రామం వరకు రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించనున్న డబుల్ రోడ్డు పనులను గురువారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గాజుల్ పెట్ చౌరస్తా వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రం ఏర్పడిన తరువాత పట్టణంలో 3 సమస్యలు ఉండేవని కడ్తాల్ నుండి సోఫీ నగర్ వరకు 4 కోట్లతో డివైడర్, రహదారి మరమ్మతులు నిర్మాణం చేపడుతున్నామని అలాగే సరస్వతి కెనాల్ బ్రిడ్జి వెడల్పు చేయనున్నామని అన్నారు.
 
గాజుల్ పెట్ చౌరస్తా నుండి గాజుల్ పెట్, లంగ్డాపూర్, వెంగ్వాపెట్ మీదుగా ఆలూర్ వరకు రహదారి కోసం 4 కోట్లు మంజూరు చేశామని మొదటగా డ్రైనేజీ పనులు పూర్తి చేసి రహదారి పనులు ప్రారంభిస్తామని అన్నారు. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించినట్లు తెలిపారు.
 
ఆలూర్ వరకు డబుల్ రోడ్డు వేసి మధ్యలో డివైడర్ ఏర్పాటు చేసి లైట్లు పెట్టనున్నామని తెలిపారు. మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ల ఆధ్వర్యంలో నిర్మల్ పట్టణం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఐదున్నర కోట్లతో మంచిర్యాల చౌరస్తా నుండి గాజుల్ పెట్ చౌరస్తా వరకు రోడ్డు వెడల్పు చేసి సుందరీకరణ పనులు చేపడుతున్నామని అన్నారు నిర్మల్‌కి మరింత శోభ రానుందని అన్నారు. అనంతరం రాంరావ్ బాగ్‌లో జౌళి నాళా పూడికతీత పనులను ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments