Webdunia - Bharat's app for daily news and videos

Install App

హస్తిన వాసులకు శుభవార్త.. కేసులు తగ్గాయ్.. ఆ ఆక్సిజన్‌ అక్కర్లేదు...

Webdunia
గురువారం, 13 మే 2021 (14:43 IST)
హస్తినవాసులకు ఢిల్లీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఓ శుభవార్త చెప్పారు. ఢిల్లీలో కరోనా వైరస్ ప్రభావం చాలా మేరకు తగ్గిందన్నారు. ఈ కారణంగానే గత 24 గంటల్లో పాజిటివ్ కేసుల సంఖ్య 10400కు తగ్గిందని తెలిపారు. ప్రస్తుతం కరోనా పాజిటివిటీ రేటు 14 శాతానికి చేరిందన్నారు. అందువల్ల తమకు ఇస్తున్న ఆక్సిజన్‌లో మిగులు ఆక్సిజన్‌ను వేరే రాష్ట్రాలకు కేటాయించాల్సిందిగా కేంద్రానికి లేఖ రాసినట్టు ఆయన చెప్పారు. 
 
''కరోనా కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిన సమయంలో ఢిల్లీ ప్రజలను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన కేంద్రం, ఢిల్లీ హైకోర్టుకు కృతజ్ఞతలు. కేసులు బాగా పెరిగినప్పుడు 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమైంది. ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ఆక్సిజన్ అవసరం కూడా 582 మెట్రిక్ టన్నులకు తగ్గింది. మిగులు ఆక్సిజన్‌‍ను వేరే రాష్ట్రాలకు ఇవ్వాలని కేంద్రానికి చెప్పాం. మాది బాధ్యత గల ప్రభుత్వం'' అని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.
 
అలాగే, ప్రస్తుతం ఆసుపత్రుల్లోని ఆక్సిజన్ బెడ్లు ఖాళీ అవుతున్నాయని, చాలా వరకు ఆక్సిజన్ అవసరం తగ్గిందని డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా వెల్లడించారు. 15 రోజుల క్రితం వరకు రోజూ 700 టన్నుల వరకు ఆక్సిజన్ అవసరం అయిందని, ఇప్పుడది 582 టన్నులకు తగ్గిందని వివరించారు. 

సంబంధిత వార్తలు

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments