Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూలై25న పెట్‌ అడాప్షన్‌, ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించనున్న మార్స్‌ పెట్‌కేర్‌

Webdunia
గురువారం, 22 జులై 2021 (22:54 IST)
యానిమల్‌ వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్‌ వెట్స్‌ సొసైటీ ఫర్‌ యానిమల్స్‌ వెల్ఫేర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (వీఎస్‌ఏడబ్ల్యుఆర్‌డీ)తో కలిసి మార్స్‌ పెట్‌కేర్‌ సంస్ధ ఈ నెల 25వ తేదీన హైటెక్‌ సిటీ వద్ద నున్న వీ కన్వెన్షన్‌ సెంటర్‌లో పెట్‌ అడాప్షన్‌, ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించబోతుంది.

ఈ ఆరోగ్య శిబిరం ద్వారా వీధి జంతవుల పట్ల అవగాహన కల్పిస్తూనే కుక్క, పిల్లి పిల్లలను దత్తత తీసుకునేందుకు  నగరవాసులనూ ప్రోత్సహించనున్నారు. వరుసగా నిర్వహించబోయే ఈ ఆరోగ్య శిబిరాలలో మొదటి దానిని ఈ నెల 25వ తేదీ ఉదయం 11 గంటల నుంచి వీ సెంటర్‌లో నిర్వహించనున్నారు.

ఈ పెట్‌ హెల్త్‌ శిబిరంలో భాగంగా రెండు మొబైల్‌ డాగ్‌ క్లీనిక్స్‌ను సైతం అందుబాటులో ఉంచనున్నారు. పెంపుడు జంతువుల ఆరోగ్య పరీక్షలను చేయడంతో పాటుగా యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌లను సైతం ఇక్కడ అందించనున్నారు.

ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్‌లోని  వెటర్నరీ సైన్స్‌ కాలేజీలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మెడిసన్‌ హెడ్‌ ఆఫ్‌ ద డిపార్ట్‌మెంట్‌ డాక్టర్‌ సతీష్‌ కుమార్‌ తో పాటుగా వీఎస్‌ఏడబ్ల్యుఆర్‌డీ ఫౌండర్‌ డాక్టర్‌ మురళీధర్‌ దాసరి తదితరులు పలు అంశాలపై ఉపన్యసించనున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ద నటులతో నటించా, ఆత్మహత్య చేసుకునే స్థితిలో వున్నా: పావలా శ్యామల (video)

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి సతీష్ నీనాసం ఫస్ట్ లుక్

టెక్నాలజీ కీలకపాత్రతో నూతన చిత్రం షూటింగ్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments