Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగిత్యాల జిల్లా.. బస్సు టైర్ కింద తలపెట్టిన మహిళ

Webdunia
శనివారం, 22 జులై 2023 (13:34 IST)
Bus Accident
జగిత్యాల జిల్లాలో ఓ మహిళ బస్సు కింద తలపెట్టింది. కదులుతున్న బస్సు కింద ఇలా మహిళ తలపెట్టడంతో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో ఓ బస్సు స్టాప్ వద్ద జులై 20న ఆర్టీసీ బస్సు ఆగింది. 
 
ప్రయాణికులు దిగటం, ఎక్కటం అయిపోయాక కండక్టర్ సిగ్నల్ ఇచ్చాడు. డ్రైవర్ కూడా బండిని స్టార్ట్ చేశాడు. అయితే ఉన్నట్టుండి ఓ మహిళ బస్సు కదలగానే నేరుగా వెనుక టైరు కింద తలపెట్టి పడుకుంది. దీన్ని గమనించిన ప్రయాణికులు గట్టిగా కేకలు వేశారు. డ్రైవర్ అప్రమత్తమై వెంటనే బ్రేకులు వేశాడు. 
 
బస్సు అర మీటరు వరకు ఆమెను ముందుకు ఈడ్చుకెళ్లింది ఈ ఘటనలో ఆమె కుడి చేయికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఆమెను బస్సు కింద నుంచి లాగిన స్థానికులు అనంతరం ఆమెను ఆసుపత్రికి తరలించారు. బస్సు కింద పడిన మహిళ మెట్‌పల్లికి చెందిన పుప్పాల లక్ష్మీ(48) గా గుర్తించారు. 
 
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

హరిహర వీరమల్లు లో అసరుల హననం సాంగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు

Manisharma: మణిశర్మ ఆవిష్కరించిన వసుదేవ సుతం గ్లింప్స్

పెళ్లి పీటలెక్కనున్న విశాల్.. వధువు ఎవరంటే?

ఏస్ చిత్రంలో జూదం అనేది ఉప్పెనలాంటిదంటున్న విజయ్ సేతుపతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments