Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మానాన్నలు న్యాయం చేయాలంటూ సెల్ టవర్ ఎక్కిన ప్రేమికుడు...

ఉపేంద్ర అనే యువ‌కుడు య‌దాద్రి స‌మీపంలో త‌న‌కు న్యాయం చేయాలి, లేదా చ‌నిపోతాను అంటూ సెల్ ట‌వ‌ర్ ఎక్కాడు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే... ఉపేంద్ర‌ కులాంతర వివాహం చేసుకున్నాడు, ఇంట్లోకి తల్లిదండ్రులు రమ్మంటారని తొమ్మిది సంవత్సరాలుగా ఎదురుచూశాడు. కాని తల్లిదండ్ర

Webdunia
సోమవారం, 11 జూన్ 2018 (20:17 IST)
ఉపేంద్ర అనే యువ‌కుడు య‌దాద్రి స‌మీపంలో త‌న‌కు న్యాయం చేయాలి, లేదా చ‌నిపోతాను అంటూ సెల్ ట‌వ‌ర్ ఎక్కాడు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే... ఉపేంద్ర‌ కులాంతర వివాహం చేసుకున్నాడు, ఇంట్లోకి తల్లిదండ్రులు రమ్మంటారని తొమ్మిది సంవత్సరాలుగా ఎదురుచూశాడు. కాని తల్లిదండ్రుల మ‌న‌సు కొంతైనా చలించలేదు. తీవ్ర నిరాశకు లోనైన ఉపేందర్ తనకు న్యాయం చేయాలంటూ సెల్ టవర్ ఎక్కాడు. 
 
మోత్కూర్ మండల కేంద్రానికి చెందిన ఉపేందర్ వడ్రంగి కులానికి చెందినవాడు. గౌడ కులానికి చెందిన సంతోష అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లాడాడు. అనంతరం ఇంటికి వెళ్లిన ఈ జంటని అబ్బాయి తల్లిదండ్రులు కనీసం గడప కూడా తొక్కనివ్వలేదు. కులం తక్కువ దాన్ని చేసుకున్నావు అంటూ ఇంట్లోకి రావొద్దు అంటూ వెళ్ళిపొమ్మన్నారు. దీంతో చేసేదేమీ లేక తొమ్మిది సంవత్సరాలుగా ఒక రూమ్ తీసుకొని ఉంటున్నారు.
 
గత నెలలో ఈ విషయాన్ని మహిళా సంఘాలు, పోలీసులు దృష్టికి తీసుకెళ్లాడు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో అబ్బాయి ఇంటిముందు ధర్నా చేశారు. పోలీసులు జోక్యం చేసుకొని ధర్నా విరమించండి మేము న్యాయం చేస్తాం అని హామీ ఇవ్వగా ధర్నా విరమించారు. నెలలు గడుస్తున్నా పోలీసులు కూడా ఎలాంటి న్యాయం చేయలేదు అంటూ మనస్తాపానికి గురైన ఉపేందర్ ఈ రోజు సెల్ టవర్ ఎక్కాడు. తనకు న్యాయం చేసేంతవరకు ఇక్కడి నుండి దిగనని మొండికేసి కూర్చున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆడ పిల్లలు ఎదిగేందుకు తోడ్పాడు అందించాలి : నారి గ్లింప్స్ రిలీజ్ చేసిన మంత్రి సీతక్క

'పుష్ప 2' చిత్ర టికెట్ ధరల పెంపునకు టి సర్కారు అనుమతి

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ హీరో

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments