తెలంగాణ బడ్జెట్ 2018-19: వ్యవసాయానికి పెద్దపీట.. పెట్టుబ‌డి ప‌థ‌కం కోసం రూ.12వేల కోట్లు

తెలంగాణ సర్కారు రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయాని పెద్దపీట వేసింది. వార్షిక బ‌డ్జెట్‌ 2018-19లో భాగంగా తొలుత వ్య‌వ‌సాయ రంగానికి చేసిన కేటాయింపుల గురించే ప్ర‌స్తావించారు. ఇందులో ప్ర‌ముఖంగా పెట్టుబ‌డి ప‌థ‌క

Webdunia
గురువారం, 15 మార్చి 2018 (11:39 IST)
తెలంగాణ సర్కారు రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయాని పెద్దపీట వేసింది. వార్షిక బ‌డ్జెట్‌ 2018-19లో భాగంగా తొలుత వ్య‌వ‌సాయ రంగానికి చేసిన కేటాయింపుల గురించే ప్ర‌స్తావించారు. ఇందులో ప్ర‌ముఖంగా పెట్టుబ‌డి ప‌థ‌కం గురించి ప్ర‌స్తావించారు. ఈ ప‌థ‌కం కోసం ఏడాదికి రూ.12 వేల కోట్లు కేటాయిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. రెండు పంట‌ల‌కు క‌లిపి ఎక‌రాకు రూ.8 వేలు ఇవ్వ‌నున్న‌ట్లు వెల్లడించారు.
 
అలాగే భూ రికార్డుల ప్ర‌క్షాళ‌న కోసం ధ‌ర‌ణి వెబ్‌సైట్‌ను ప్రారంభించిన‌ట్లు తెలిపారు. రైతుల‌కు రూ.5 ల‌క్ష‌ల బీమా సౌక‌ర్యం క‌ల్పిస్తున్న‌ట్లు ఈట‌ెల తెలిపారు. ఇంకా బిందు, తుంప‌ర సేద్యానికి రూ.127 కోట్లు కేటాయించారు.  
 
ఇంకా బడ్జెట్ కీలకాంశాలను పరిశీలిస్తే.. 
ఆరోగ్య లక్ష్మి పథకానికి రూ.298 కోట్లు 
మహిళాశిశు సంక్షేమానికి రూ.1799 కోట్లు
ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధి కింద రూ.9693 కోట్లు 
ఎస్సీ అభివృద్ధి శాఖకు రూ.12709 కోట్లు 
దళితులకు భూ పంపిణీ కింద రూ,1469 కోట్లు  
ఎస్టీల అభివృద్ధి శాఖకు 8063 కోట్లు 
 
రోడ్లు, రవాణా, భవనాల కోసం రూ.5,575 కోట్లు 
విద్యుత్ కోసం రూ.5,650కోట్లు 
చేనేత, టెక్స్‌టైల్ రంగానికి రూ.1200 కోట్లు 
పరిశ్రమలు, వాణిజ్య శాఖ రూ.1286 కోట్లు 
వరంగల్ నగర అభివృద్ధికి రూ.300 కోట్లు 
పట్టణాభివృద్ధి శాఖ రూ.7251 కోట్లు కేటాయిస్తున్నట్లు ఈటెల ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AA22: స్పైడర్-మ్యాన్, అవెంజర్స్ తరహాలో AA22 చిత్రం ఉండబోతుందా ?

K. Raghavendra Rao: మహిళలకు డైమండ్ డెకాయిట్ చిత్రం ఉచితం

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఫుల్-లెంగ్త్ ఎంటర్టైనర్ : ప్రొడ్యూసర్ శివప్రసాద్

VV Vinayak: వివేక్ మిశ్రా, శృతిక జంటగా అహోం.ప్రారంభం

AA22 x A6 ప్రీ లుక్ పోస్టర్‌.- అంచనాలు రెట్టింపు చేసిన టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఊబకాయం: అద్దంలో కనిపించే లావు కాదు, అడుగడుగునా పొంచి ఉన్న ఆరోగ్య సంక్షోభం

హెచ్చరిక: అందరి దృష్టిని ఆకర్షించేలా తన లేటెస్ట్ కలెక్షన్‌ను రూపొందించిన మోచీ

UP Woman Scripts History: ఖాట్మండు నుంచి ఎవరెస్ట్ వరకు సైకిల్ యాత్ర.. దివ్య సింగ్ రికార్డ్ (video)

మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని పండ్లు, ఏంటవి?

హైదరాబాద్‌లో ట్రామా- ఎమర్జెన్సీ మెడిసిన్‌పై జాతీయ సదస్సును ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా

తర్వాతి కథనం
Show comments