కేసీఆర్‌లా కోడికూర, కల్లు సీసా అడగడం లేదు.. రేవంత్ రెడ్డి

Webdunia
బుధవారం, 28 నవంబరు 2018 (13:39 IST)
కోస్గిలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రసంగించారు. కేసీఆర్ కుటుంబాన్ని మరోసారి గెలవనిచ్చేది లేదన్నారు. ఒక్కసారి వాళ్లు గెలిస్తే వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. కేసీఆర్ ఇచ్చిన హామీలన్నింటిని గంగలో కలిపేశాడని రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. 
 
తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తీసుకొద్దామని రేవంత్ రెడ్డి కోరారు. తాను ఓట్లు మాత్రమే అడుగుతున్నానని, కేసీఆర్‌లా కమీషన్లు, వాటాలు, కోడికూర, కల్లు సీసా అడగట్లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ రాకతో కోస్గి పునీతమైందని రేవంత్ రెడ్డి అన్నారు. తనను కొండగల్ ప్రజలు గుండెల్లో పెట్టి చూసుకున్నారన్నారు. 
 
తొమ్మిదేళ్ల క్రితం కొడంగలా.. వరంగలా అని అవమానించారని తెలిపారు. కేసీఆర్‌‍పై పోరాటం చేస్తున్నందుకు 39 కేసులు పెట్టారని.. అయినా వెనక్కి తగ్గేది లేదని ప్రజల అండతో చివరిదాకా పోరాటం చేశానన్నారు. కురుక్షేత్రంలో ప్రజలే విజేతలని రేవంత్ రెడ్డిచెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

తర్వాతి కథనం
Show comments