Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందు బాబుల వలన ఆదాయం ఎంతో తెలుసా?

Webdunia
గురువారం, 7 మే 2020 (19:00 IST)
కరోనా వలన అంతా స్తంభించిపోవడం... రాష్ట్రప్రభుత్వాలకు నష్టం రావడం తెలిసిందే. అయితే.. రాష్ట్ర ప్రభుత్వాలకు మద్యం వలన బాగా ఆదాయం వస్తుంది. అందుకనే.. 43 రోజులగా ప్రజలు మద్యం లేకుండా ఉండగలమని ప్రజలు నిరూపించినా... ప్రభుత్వాలు మాత్రం మద్యం అమ్మకుండా ఉండలేమని నిరూపించాయి. లాక్ డౌన్‌తో 43 రోజుల తరవాత మద్యం షాపులు తెరుచుకున్నాయి. దీంతో మద్యం షాపుల ముందు జనం భారీగా క్యూకట్టారు. 
 
నిన్న సాయంత్రం 4 గంటల వరకు పాత స్టాక్‌నే అమ్మారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి కొత్త ఇండెంట్ల మేరకు స్టాక్ విడుదల చేసింది ఎక్సయిజ్ డిపో.
 
 మద్యం డిపోల నుంచి నిన్న ఒక్కరోజే 980 షాపులకు 80 కోట్ల లిక్కర్ అమ్మకం జరిగినట్టు సమాచారం. ఇక ఆదాయం విషయానికి వస్తే... మద్యం దుకాణాల ద్వారా నిన్న ఒక్కరోజే 180 కోట్ల మేరకు మద్యం అమ్మకాలు జరిగాయని తెలిసింది. 
 
180 కోట్ల మద్యం అమ్మకాల్లో ప్రభుత్వనికి ఆదాయం 108 కోట్లు. తాజాగా పెరిగిన మద్యం ధరలతో వ్యాట్ కలిపి ప్రభుత్వ ఖజానాకు నెలకు 450 కోట్ల అదనపు ఆదాయం వస్తుంది. లాక్ డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన 42 మద్యం షాపులను సీజ్ చేసారు. 
ఆంధ్ర, తెలంగాణలో పోటాపోటీగా అమ్మకాలు జరిగాయి. ధరలు పెంచినా.. మందు ప్రియులు ఎక్కడా తగ్గడం లేదు. మందు తాగాల్సిందే.. కిక్కు పొందాల్సిందే... అంటూ మందు షాపుల ముందు మందుబాబులు క్యూకట్టడం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments