Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కడలూరులో గిన్నిస్ రికార్డు : మద్యం షాపు ఎదుట 3 కిమీ క్యూ

Advertiesment
కడలూరులో గిన్నిస్ రికార్డు : మద్యం షాపు ఎదుట 3 కిమీ క్యూ
, గురువారం, 7 మే 2020 (14:07 IST)
తమిళనాడు రాష్ట్రంలోని కడలూరులో మందుబాబులు సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఓ మద్యం షాపు ముందు మద్యం కోసం మందుబాబులు బారులు తీరారు. ఈ బారు ఏకంగా మూడు కిలోమీటర్ల మేరకు కొనసాగింది. ఈ తరహా క్యూ ఓ మద్యం దుకాణం ఎదుట ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా కనిపించలేదు. దీంతో ఇది గిన్నిస్ బుక్ రికార్డులకెక్కింది.
 
కరోనా వైరస్ దెబ్బకు దేశం యావత్తూ లాక్‌డౌన్‌లోకి వెళ్లింది. దీంతో గత 40 రోజులకు పైగా మద్యం దుకాణాలు మూతపడ్డాయి. ఈ క్రమంలో ఇటీవల కేంద్రం లాక్‌డౌన్ ఆంక్షలను సడలించింది. దీంతో పలు రాష్ట్రాలు మద్యం దుకాణాలను తెరుస్తున్నారు. ఇందులోభాగంగా, తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నుంచి మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. 
 
దీంతో కడలూరు జిల్లాలోని ఓ మద్యం దుకాణానికి మందుబాబులు వేకువజాము నుంచే రావడం మొదలుపెట్టి వరుసలో నిల్చోసాగారు. ఈ బారు మధ్యాహ్నానికి మూడు కిలోమీటర్లకు మించిపోయింది. పోలీసులు సైతం ద్విచక్రవాహనాల్లో పెట్రోలింగ్ చేస్తూ మందుబాబులను వరుసలో ఉండేలా చర్యలు తీసుకున్నారు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హిజ్బుల్ ముజాహిద్దీన్ అగ్రనేత రియాజ్ ఓ లెక్కల మాస్టారు...