ముందస్తు ప్రకటన లేకుండా ఎయిర్ ఇండియా విమానాల రద్దు.. ప్రయాణికుల ఆందోళన

Webdunia
సోమవారం, 10 ఏప్రియల్ 2023 (10:58 IST)
హైదరాబాద్ నగరంలోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ఎయిర్ ఇండియా విమానాలను ఆ సంస్థ ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా రద్దు చేసింది. దీంతో తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు విమానాశ్రయానికి వచ్చిన ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానాలు రద్దు చేస్తే ముందస్తు సమాచారం ఇవ్వరా అంటూ వారు ఎయిరిండియా అధికారులను నిలదీశారు. 
 
ఈ ఎయిర్‌పోర్టు నుంచి తిరుపతి, బెంగుళూరు, మైసూరు, చెన్నై తదితర ప్రాంతాలకు ఎయిరిండియా సంస్థ విమాన సర్వీసులను నడుపుతుంది. అయితే, ఆ సంస్థ సోమవారం ఉన్నట్టుండి ఈ ప్రాంతాలకు సర్వీసులను రద్దు చేసింది. సాంకేతిక కారణాలతో రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. 
 
అయితే, ముందస్తు సమాచారం లేకుండా చివరి నిమిషంలో విమానాలు రద్దు చేయడంపై ప్రయాణికులు ఆందోళనకు దిగారు. సిబ్బంది తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన యాజమాన్యం.. టికెట్‌ డబ్బులను ప్రయాణికులకు రీఫండ్‌ చేస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments