Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిడిపిలో ఉండలేను, టిఆర్ఎస్‌కు పోతానంటున్న ముఖ్య నేత, ఎవరు?

Webdunia
సోమవారం, 7 జూన్ 2021 (19:08 IST)
తెలంగాణా రాష్ట్రంగా అవతరించిన తరువాత ప్రధాన పార్టీల్లో చీలికలు రావడం.. చాలామంది నేతలు టిఆర్ఎస్ లోకి వెళ్ళిపోవడం జరిగిపోయాయి. ఇదంతా తెలిసిందే. ముఖ్యంగా పటిష్టంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న వారి సంఖ్యే ఎక్కువ.
 
అలాగే తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉన్న నేతలు కూడా తెలంగాణా రాష్ట్రసమితిలో చేరారు. వారికి పదవులు కూడా లభించాయి. ప్రస్తుతం మంత్రులుగాను, కీలక పదవుల్లోను కొనసాగుతున్నారు. అయితే ఎపిలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ తెలంగాణాలో అడ్రస్ లేకుండా పోతోందన్నది విశ్లేషకుల భావన.
 
అందుకే తెలంగాణాలో ఉన్న టి.టిడిపి నేతలందరూ వేరే పార్టీలోకి వెళ్ళిపోవాలన్న ఆలోచనలో ఉన్నారట. టిటిడిపి అధ్యక్షుడుగా ఉన్న రమణే టిఆర్ఎస్ లోకి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసేసుకున్నారట. టిఆర్ఎస్ పైన కనీసం విమర్సలు కూడా చేయడం లేదు తెలుగుదేశంపార్టీ నాయకులు.
 
టిఆర్ఎస్‌ను టార్గెట్ చేస్తోంది బిజెపి, కాంగ్రెస్ పార్టీలు మాత్రమే. టిడిపిలో ఉన్న నేతలందరూ కూడా వెళ్ళిపోతున్నారు. దీంతో చేసేది లేక టిటిడిపి రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పుకుని తెలంగాణా రాష్ట్రసమతి జెండా పట్టుకోవాలన్న నిర్ణయానికి వచ్చేశారట ఎల్.రమణ. 
 
అయితే పార్టీ జాతీయ అధ్యక్షుడు నారాచంద్రబాబునాయుడు మాత్రం పార్టీని వీడొద్దని రమణను బుజ్జగిస్తున్నారట. కానీ ఇన్నిరోజుల పాటు పార్టీని నమ్ముకుని ఉన్నా కనీసం విమర్సలు కూడా చేయలేని పరిస్థితుల్లో  ఉండడం..నమ్మకంగా ఉన్న కార్యకర్తలు, నాయకులందరూ కూడా టిఆర్ ఎస్ లోకి వెళ్ళిపోతుండడం రమణకు ఏ మాత్రం ఇష్టం లేదట. అందుకే తాను కూడా పార్టీ మారాలన్న నిర్ణయానికి ఆయన వచ్చేశారట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించిన ఓటీటీ స్ట్రీమింగ్ మయసభ రివ్యూ

Vadde naveen: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు గా వడ్డే నవీన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments