తిరుమలలో కేటీర్ దర్శనం వివాదాస్పదం, ఆయన గుడిలోకి ఎలా వెళ్లారో చెప్పాలంటూ

Webdunia
మంగళవారం, 7 జనవరి 2020 (20:54 IST)
ముక్కోటి ఏకాదశి సందర్భంగా పలువులు కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల మంత్రలు ఎమ్మెల్యేలు వెంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకోవడానికి క్యూ కట్టారు. అయితే  ఎన్నడూ లేని విధంగా ఈసారి తిరుమలకు విఐపిల తాకిడి ఎక్కువ అయింది. ఇందులో భాగంగా స్వామిని దర్శించుకోవడాని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటిఆర్, భార్య శైలిమి, కుమార్తెతో సహా వచ్చారు. 
 
అయితే నిబంధనలకు విరుద్ధంగా కేటిఆర్‌ని బయోమెట్రిక్ ద్వారా శ్రీవారి ఆలయంలోకి అనుమతించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులను కంపార్టుమెంట్లలో వేచివుండేలా చేసి కేటిఆర్‌ని మాత్రం ముందుగానే ఆలయంలోకి ఎలా తీసుకువెళతారని విమర్శించారు భారతీయ జనతా పార్టీ నేత భాను ప్రకాష్ రెడ్డి. 
 
సోమవారం వేకువజామున 12.30 గంటల నుండి 1.30 గంటల మధ్య ఆలయ ప్రవేశం చేసిన వారి వివరాలను బహిర్గతం చెయ్యాలని, సిసి టివి ఫుటేజిని మీడియాకు విడుదల చెసి భాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు భాను ప్రకాష్ రెడ్డి. శ్రీవారి ఆలయ సంప్రదాయాలను కాపాడవలసిన పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంటుందని, అంతేగాని నచ్చిన వారి కోసం నిబంధనలు మార్చడం మహాపాపం అన్నారు భాను ప్రకాష్ రెడ్డి. గతంలో భాను ప్రకాష్ రెడ్డి తిరుమల తిరుపతి బోర్డు మెంబరుగా పనిచేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments