Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ఫీ కావాలంటే.. రూ.500 చెల్లించాలి.. మంత్రి కేటీఆర్ సరదా వ్యాఖ్యలు

Webdunia
మంగళవారం, 11 ఏప్రియల్ 2023 (11:15 IST)
తనతో సెల్ఫీ ఫోటో కావాలంటే రూ.500 చెల్లించాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ సరదాగా వ్యాఖ్యానించారు. నిజానికి మంత్రి కేటీఆర్‌కు యువతలో అమితమైన క్రేజ్ వుంది. అందుకే ఆయన కనిపిస్తే చాలు ఆయనతో సెల్ఫీ, ఫోటోలు దిగేందుకు ప్రతి ఒక్కరూ అమిత ఉత్సాహం చూపిస్తుంటారు. అలాగే, మంత్రి కేటీఆర్ కూడా అడిగినవారికి కాదనకుండా సెల్ఫీలు, ఫోటోలు దిగుతుంటారు. 
 
తాజాగా ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా యువత ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. అయితే, అడిగినవారిని కాదనకుండా మంత్రి ఫోటోలకు ఫోజులిచ్చారు. కానీ, అభిమానుల తాడికి ఎక్కువైపోవడంతో సెల్ఫీ కావాలంటో రూ.500 ఖర్చు అవుతుందంటూ సరదాగా కామెంట్స్ చేశారు. 
 
అయితే, మంత్రి కేటీఆర్‌ను చూసిన సంతోషంలో ఉన్న అభిమానులు, యువత ఈ కామెంట్స్‌ను ఏమాత్రం పట్టించుకోకుండా సెల్ఫీలు తీసుకునేందుకు పోటీపడ్డారు. ప్రస్తుత మంత్రి కేటీఆర్ సరదాగా చేసిన వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mad: నవ్వినవ్వి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ : దర్శకుడు కళ్యాణ్ శంకర్

అమర్ దీప్ చౌదరి హీరోగా సుమతీ శతకం ప్రారంభం

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

తర్వాతి కథనం
Show comments