తాను అత్యాచారానికి పాల్పడిన ఓ యువతితని నిందితుడు వివాహం చేసుకున్నాడు. ఈ అత్యాచారం కేసులో అరెస్టు అయి జైలులో ఉంటున్న నిందితుడు.. అదే అత్యాచార బాధితురాలిని వివాహం చేసుకునేందుకు పెరోల్‌పై జైలు నుంచి విడుదలయ్యాడు. ఆ తర్వాత అత్యాచార బాధితురాలి మెడలో తాళికట్టిన నిందితుడు.. ముహూర్తం ముగిసిన తర్వాత తిరిగి జైలుకు వెళ్ళాడు. ఈ ఘటన బిహార్ రాష్ట్రంలోని గోపాల్ గంజ్ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
గోపాల్ గంజ్ జిల్లాకు చెందిన రాహుల్ కుమార్ అనే యువకుడు హాజీపుర్‌లో ఇంజినీరింగ్ చదివాడు. బాధిత యువతి ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అమ్మాయి. వీరిద్దరూ మంచి స్నేహితులు. వీరి స్నేహం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మార్చి 4న వీరు గోపాల్‌గంజ్‌లోని ఓ గుడికి వెళ్లారు.
ఆరోజు రాత్రి రాహుల్ కుమార్ స్నేహితుని ఇంటికి వెళ్లారు. ఆ రాత్రి జరిగిన ఘటనతో యువతి ఆరోగ్యం క్షీణించింది. యువతి అత్యాచారానికి గురైనట్లు వైద్యులు నిర్ధారించారు. ఆ వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రాహుల్‌ను అరెస్టు చేసి జైలుకు పంపించారు.
తాను అత్యాచారం చేయలేదనీ, ఇద్దరం ప్రేమించుకున్నామని కోర్టులో తెలిపిన నిందితుడు ఆమెను వివాహం చేసుకునేందుకు అనుమతి కోరాడు. పెరోల్‌పై వచ్చి పెళ్లి చేసుకున్నాడు. దీంతో కోర్టు ఆ యువకుడిని నాలుగు గంటల పెరోల్ మంజూరు చేసింది. దీంతో జైలు నుంచి విడుదలైన ఆ యువకుడు అత్యాచార బాధితురాలిని వివాహం చేసుకుని తిరిగి జైలుకు వెళ్లాడు.