Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో ముద్దు పెట్టించుకున్న వధువు.. ఠాణాలో వదిలేసివెళ్లిన భర్త

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2020 (10:52 IST)
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హుజూరాబాద్‌కు చెందిన యువతికి మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన యువకుడితో సోమవారం రాత్రి వివాహం జరిగింది. వధువు హుజురాబాద్‌కే చెందిన వంశీ అనే యువకుడిని ప్రేమించింది. తల్లిదండ్రుల మాట కాదనకుండా పెళ్లికి  అంగీకరించింది. 
 
ఇది తెలిసిన వంశీ సదరు యువతితో కలిసి ఉన్న ఫొటోలు, ప్రేమలేఖలను వరుడికి పంపించి పెళ్లి చేసుకోవద్దని బెదిరించాడు. అయితే వాటిని పట్టించుకోకుండా వధూవరుల తల్లిదండ్రులు వీరి వివాహం జరిపించారు. ఈ క్రమంలో బరాత్‌ ముగిసిన వెంటనే సోమవారం రాత్రి వాహనంలో వరుడి ఇంటికి వెళ్తున్నారు. 
 
ప్రియురాలి సమాచారంతో వంశీ జమ్మికుంట రోడ్డులో వాహనాన్ని అడ్డగించి వరుడి ఎదురుగానే ముద్దుపెట్టుకొని ఆమెను వదిలిపెట్టి వెళ్లాలని గొడవకు దిగాడు. దీంతో వరుడి తరపు బంధువులు అదే రాత్రి పోలీసులను ఆశ్రయించారు. అర్థరాత్రి వరకు కౌన్సెలింగ్‌ చేసిన ఇరువర్గాల వారు వినకపోవడంతో వరుడు.. వధువును పోలీసుస్టేషన్‌లోనే వదిలేసి మందమర్రికి వెళ్లిపోయాడు. 
 
ఇటు వధువు తల్లిదండ్రులు సైతం ఆమెను ఠాణాలోనే వదిలి వెళ్లారు. పోలీసులు సదరు వధువును కరీంనగర్‌లోని స్వధార్‌ హోంకు తరలించారు. ముద్దు పెట్టుకొని వివాదానికి కారణమైన వంశీపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఏసీపీ సుందరగిరి శ్రీనివాస్‌రావు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments