Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎన్నారై పెళ్లికొడుకు, శోభనం రోజున అతడు గే అని తెలిసి పెండ్లికుమార్తె షాక్

Advertiesment
ఎన్నారై పెళ్లికొడుకు, శోభనం రోజున అతడు గే అని తెలిసి పెండ్లికుమార్తె షాక్
, సోమవారం, 27 జులై 2020 (23:41 IST)
పెళ్ళి పేరుతో ఓ యువకుడు వంచించిన ఘటన గుంటూరులో కలకలం రేపింది. ఎన్ఆర్ఐ పెళ్లి పేరుతో ఓ రైతు కుటుంబం మోసపోయింది. 50 లక్షల నగదు, 75 సవర్ల బంగారం కట్నంగా ఇచ్చి ఎన్ఆర్ఐ పెళ్లికొడుకు అని సంబుర పడి గ్రాండ్‌గా వివాహం జరిపించారు.
 
అయితే శోభనానికి ఏర్పాట్లు చేస్తే నాలుగు రోజులుగా అనారోగ్యంగా ఉందని ఆ యువకుడు తప్పించుకుని తిరగడం, అతడు ప్రవర్తన విచిత్రంగా ఉండటంతో యువతి గట్టిగా నిలదీయడంతో తను గేనని, అమెరికాలో గత నాలుగేళ్లుగా ఓ బాయ్ ఫ్రెండ్‌తో సహజీవనం చేస్తున్నానని సమాధాంన చెప్పడంతో ఆ వధువు షాక్‌కు గురైంది.
 
నేను నిన్ను బాగా చూసుకుంటాను అని నీ శారీరక అవసరాలకోసం నా మిత్రుడు ఉన్నాడని చెప్పడంతో కన్నీరుమున్నీరుగా విలపించిన ఆ యువతి తల్లిదండ్రులకు చెప్పడంతో పెళ్లికొడుకు తల్లిదండ్రులను నిలదీశారు అమ్మాయి బంధువులు. దీంతో రెచ్చిపోయిన ఆ యువకుడు తల్లిదండ్రులు యువతి కుటుంబంపై దాడికి దిగారు. దీంతో తమకు న్యాయం చేయాలని అర్బన్ ఎస్పీని ఆశ్రయించింది యువతి కుటుంబం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనావైరస్ రికవరీ ఎన్ని రోజులు? ఎలాంటి స్థితిలో ప్రమాదం?