Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ సీఎం ఇంట్లో తాచుపాము... పట్టుకున్న హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ

Webdunia
శుక్రవారం, 12 జులై 2019 (11:18 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఇంట్లోకి నల్ల తాచు పాము వచ్చింది. దీంతో ఆయన వణికిపోయారు. ఈ విషయం తెలుసుకున్న హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ త్రివేది అక్కడకు వెళ్లి చాకచక్యంగా పట్టుకున్నారు. 
 
గురువారం రాత్రి జరిగిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్‌లో ఐఏఎస్ క్వార్టర్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు అనేక మంది అధికారులు నివసిస్తున్నారు. అయితే, ఈ ఏరియాలో చెట్లు, చిన్నచిన్న నీటికుంటలు, గుట్టలు అధికంగా ఉండటంతో విషసర్పాలు తరచుగా కనిపిస్తున్నాయి. 
 
ఈ క్రమంలో గురువారం చీకటి పడిన తర్వాత సీఎస్ ఎస్కే జోషి ఇంటి వెనుకభాగంలో ఓ నల్లతాచు పాము వచ్చి పడగ విప్పి బుసలు కొట్టసాగింది. దీన్ని చూసిన జోషి కుటుంబ సభ్యులతో పాటు.. స్థానికులు భయంతో వణికిపోయారు. ఈలోగా విషయం తెలుసుకున్న హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ త్రివేది అక్కడుక వెళ్లి.. తన వద్ద ఉన్న ఓ పరికరంతో దాన్ని బంధించి చాకచక్యంగా పట్టుకున్నారు. ఆ తర్వాత ఆ పాముకు ఎలాంటి హాని తలపెట్టకుండా దూరంగా వదిలిపెట్టాల్సిందిగా పోలీసులను కోరారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments