పొట్లకాయ ఆరోగ్య విషయంలోనే కాక జుట్టు సంరక్షణలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. విటమిన్ ఎ, బి, సిలతోపాటు మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్ కలిగి ఉన్న పొట్లకాయ రసాన్ని తలకి పట్టించి ఓ అరగంట తర్వాత స్నానం చేస్తే తలలోని చుండ్రు తగ్గుతుంది. శరీరంలోని టాక్సిన్లను పొట్లకాయ సమర్థవంతంగా తొలగిస్తుంది. మూత్రపిండాలు, మూత్రాశయం మెరుగ్గా పనిచేసేలా చేస్తుంది.
పొట్లకాయ గొంతులోని కఫాన్ని తగ్గించడంతో పాటు శ్వాసవ్యవస్థ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది. పొట్లకాయ రసాన్ని రోజూ రెండు కప్పులు త్రాగితే హృద్రోగాలు రాకుండా ఉంటాయి. బీపీని నియంత్రణలో ఉంచుతుంది.
మలేరియా జ్వరం వచ్చిన వారికి పొట్లకాయ రసం ఇస్తే చాలా మంచిది. ఇది యాంటీబయోటిక్‌గా పనిచేస్తుంది. పొట్లకాయలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ప్రతిరోజూ పొట్లకాయ తింటే జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. దీనిలో కేలరీలు, కొవ్వు పదార్థాలు తక్కువ మోతాదులో ఉంటాయి.