ముగ్గురిని చంపి ఆత్మహత్య చేసుకున్నాడు... ఎందుకు?

Webdunia
సోమవారం, 14 అక్టోబరు 2019 (07:29 IST)
అన్నను, అన్న కూతురిని, తన సొంత కూతురిని చంపాడు. ఆపై తాను గొంతు కోసుకున్నాడు. అనంతరం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

కామారెడ్డి జిల్లాలో ముగ్గురు కుటుంబ సభ్యులను హత్య చేసిన నిందితుడు.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిన్న దోమకొండ సమీపంలోని అటవీ ప్రాంతంలో భిక్కనూర్ మండలం జంగంపల్లికి చెందిన బందెల రవి.. తన అన్న బాలయ్య, బాలయ్య కూతురు లత, తన సొంత కూతురు చందనను శీతల పానీయంలో పురుగుల మందు కలిపి తాగించి... ఆపై గొంతు కోసి చంపేశాడు.

అనంతరం తాను కూడా గొంతు కోసుకుని సమీపంలోని గుండ్ల చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్నటి నుంచి రవి కోసం గాలించినా ఎక్కడా ఆచూకీ లభించలేదు. ఈరోజు చెరువులో మృత దేహం బయట పడింది. అన్న పెద్ద కూతురు దీప... తన భార్య తరఫు అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

ఇది తట్టుకోలేక పోయిన రవి పరువు హత్యలకు పాల్పడ్డాడు. ఒక్క ప్రేమ వివాహం నలుగురిని మింగేయడం గ్రామస్థులను కలిచి వేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కోలీవుడ్‌లో విషాదం.. నదిలో దూకి నిర్మాత ఆత్మహత్య... ఎఁదుకో తెలుసా?

Chiru158: తన 158వ సినిమా బాబీ కొల్లి కాంబినేషన్ లో ప్రారంభిస్తున్నానని ప్రకటించిన చిరంజీవి

సినిమాపై అవగాహన లేని వ్యక్తికి సినిమాటోగ్రఫీ శాఖనా? సీఎం విజయ్‌పై విశాల్ ఫైర్

రజనీకాంత్‌తో పోటీపడతాను.. అసూయ లేదు : కమల్ హాసన్

నడిరోడ్డుపై నటి పావలా శ్యామల - నిర్మాత దిల్ రాజు పెద్ద మనసు

తర్వాతి కథనం
Show comments