Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం దుకాణాల కేటాయింపుల్లో రిజర్వేషన్.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 8 నవంబరు 2021 (14:11 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. వ్యాపారాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అవకాశం ఇవ్వాలనే మద్యం షాపుల కేటాయింపుల్లో రిజర్వేషన్ విధానాన్ని తీసుకువచ్చారు. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. 
 
దేశంలో ఎక్కడా లేనివిధంగా వైన్ షాపుల కేటాయింపుల్లో రిజర్వేషన్లు కల్పించి సీఎం కేసీఆర్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో మద్యం షాపుల రిజర్వేషన్ కేటాయింపు డ్రా కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2620 షాపులకిగాను 756 షాపులకి రిజర్వేషన్లు కల్పించామన్నారు. వాటిలో 363 షాపులు గౌడ్లకు.. 262 ఎస్సీలకు 131 ఎస్టీలకు రిజర్వేషన్ల ప్రాతిపదికన కేటాయించామన్నారు. అప్లికేషన్, లైసెన్స్ ఫీ పెంచలేదని, నామమాత్రంగా షాపుల సంఖ్యను పెంచామని చెప్పారు.
 
ఒక మనిషి.. ఒకే షాప్ అనే నిబంధన తీసివేశామన్నారు. రాష్ట్రంలో గుడంబా, గంజాయి, మత్తుపదార్థాల విక్రయాలపై ఉక్కుపాదం మోపుతామని, ఎలాంటి వారిపైనైనా పీడీ కేసులు పెడతామని హెచ్చరించారు. కల్తీ మద్యం లేకుండా చూస్తామన్నారు. 
 
భవిష్యత్‌లో కాంట్రాక్టులు, మెడికల్ షాపుల కేటాయింపుల్లో కూడా రిజర్వేషన్‌ను అమలు చేసే అంశం పరిశీలనలో ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అన్ని కులాల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని, ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments