Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం... 100 నియోజకవర్గాలు గెలిచి వస్తా.. కేసీఆర్

Webdunia
గురువారం, 15 నవంబరు 2018 (16:08 IST)
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ తరువాత  స్వామివారి ముందు నామినేషన్ పత్రాలు పెట్టి ప్రార్థించారు. మంత్రి హరీష్ రావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్, టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. 
 
రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి వంద సీట్లు దక్కేలా ఓటు వేయాలని ప్రజలను కోరారు. సిద్దిపేట నుండి హరీష్ రావు లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు సీఎం కేసీఆర్‌కు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెబుతున్నా.... దేశంలోనే సంపన్న రైతులు ఎక్కడ ఉన్నారు అంటే తెలంగాణలో అనే విధంగా రైతాంగాన్ని అభివృద్ధి చేసి తీరుతానని హామీ ఇచ్చారు.
 
ప్రతి రాజకీయ అడుగులో ఈ ప్రాంతం నాకు అండగా నిలిచింది. ఇక్కడి వెంకటేశ్వర స్వామి ఆశీర్వచనం లేనిది ఎప్పుడు ముందుకు వెళ్ళలేదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో సిద్ధిపేటను విడిచి వెళ్లాల్సి వచ్చింది. రాజకీయ యుద్ధంలోకి దిగబోతున్నాను. 100 నియోజకవర్గాల్లో విజయం సాధించి మళ్ళీ మీ ముందుకు వస్తానని ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తమిళ డి ఎన్ ఏ చిత్రం తెలుగులో మై బేబి గా రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

తర్వాతి కథనం
Show comments