హరీష్‌ రావుకు మాపై అసూయ.. కేసీఆర్ వ్యాఖ్యలు

Webdunia
సోమవారం, 12 నవంబరు 2018 (12:23 IST)
తన మేనల్లుడు, రాష్ట్ర మాజీ మంత్రి టి. హరీష్ రావుకు అసూయ పుట్టినట్టుగా ఉందని తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు విన్న మీడియా మిత్రులతో పాటు పార్టీ నేతలు ఒక్కసారి అవాక్కయ్యారు. ఆ తర్వాత హరీష్‌కు అసూయ ఎందుకు పుట్టిందో కేసీఆర్ వివరించారు. 
 
'ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్లు చాలా అదృష్టవంతులని, సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాను కూడా ఎంజాయ్‌ చేశానని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని భుజానికెత్తుకున్నాక పార్టీ అధినేతగా చాలా కష్టపడ్డా. నిద్ర లేని రాత్రులు గడిపి ప్రణాళికలు రచించాం. రాజకీయ నాయకులకు విశ్రాంతి ఉండకూడదన్నారు. 
 
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేయాలని హరీశ్‌కు ఆనాడే చెప్పా. అందుకే హరీశ్‌ సిద్దిపేట అభివృద్ధికి, కోటి ఎకరాల మాగాణికి కష్టపడుతున్నాడు. కానీ, గజ్వేల్‌ అభివృద్ధిని చూసి అసూయ పడుతున్నాడు. సిద్దిపేట అభివృద్ధిని గజ్వేల్‌ మించిపోతోందనే కావచ్చు' అంటూ కేసీఆర్ చమత్కరించడంతో భలో నవ్వులు పూయించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నటి దివ్య సురేష్‌కు చేదు అనుభవం.. భద్రత ఎక్కడ ఉన్నాయి? (video)

Samantha: మహిళా సూపర్ స్టార్లు రావాలంటే నిర్మాతలు ముందుకు రావాలి : సమంత రూత్ ప్రభు

Vishal: శివ చూశాక దర్శకుడిగా మారాలని ఫిక్స్ అయ్యాను : విశాల్

Virat Karna: చలికి శరీరం ఫ్రీజ్ అయింది - నాగసాధు మేకప్ కి ఆరు గంటలు పట్టేది.: విరాట్ కర్ణ

Brahmanandam: హ్యాంగ్‌మెన్ లాంటి ఆలోచన రావడమే గొప్ప విషయం :డా. బ్రహ్మానందం

తర్వాతి కథనం
Show comments