రోజుకో నిరుద్యోగి హత్యతో కేసీఆర్ రాక్షసానందం: షర్మిల ఫైర్

Webdunia
శుక్రవారం, 13 ఆగస్టు 2021 (17:30 IST)
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై వైఎస్సార్‌టీపీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుండా 26 ఏళ్ల‌ నరేశ్‌‌ను హత్య చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ రోజుకో నిరుద్యోగి హత్యతో రాక్షసానందం పొందుతున్నారు. రాతిగుండె కేసీఆర్ ఇంకెంత మందిని పొట్టనపెట్టుకుంటారు? ఇంకెంత మంది చనిపోతే నోటిఫికేషన్లు విడుదల చేస్తారు? ఇప్పటికే వంద‌ల‌ మంది నిరుద్యోగులు చనిపోయారు' అని ష‌ర్మిల విమ‌ర్శ‌లు గుప్పించారు.
 
'ఇంకెంతమంది తల్లులు చేతికందిన కొడుకులను కోల్పోయి గర్భశోకం అనుభవిస్తే మీ కండ్లు చల్లబడుతాయి? ఇంత దిక్కుమాలిన రాజకీయాలు చేయడానికేనా మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసింది? వెంటనే రాజీనామా చేసి.. ముక్కు నేలకి రాసి నిరుద్యోగులకు క్షమాపణ చెప్పి నువ్వు ఇంకా మనిషివే అని నిరూపించుకో కేసీఆర్' అని ష‌ర్మిల పేర్కొన్నారు.
 
ఉపాధ్యాయ ఉద్యోగాల‌ కోత పెడుతున్నార‌ని, ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో వైద్యం స‌రిగ్గా అంద‌ట్లేద‌ని కేసీఆర్ పై ష‌ర్మిల విమ‌ర్శించారు. 'టీచర్ ఉద్యోగాల కోతతో ఉరితాడు పెనుతున్నవ్. మీ 7 ఏండ్ల పాలనలో.. సర్కార్ విద్యను .. సర్కార్ వైద్యాన్ని భ్రష్టు పట్టించినవ్.. సర్కార్ బడులను సక్కగా చేసుడు చేతకానప్పుడు..  ఉద్యోగాలు కల్పించడం చేతకానప్పుడు..  పరిపాలన చేయడం చేతకానప్పుడు ..  మీకు ముఖ్యమంత్రి పదవి కూడా దండుగ కేసీఆర్' అని ఆమె విమ‌ర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments