Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజామాబాద్ MLCగా కవిత.. కేసీఆర్‌కు కృతజ్ఞతలు

Webdunia
శుక్రవారం, 26 నవంబరు 2021 (18:51 IST)
స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు చెందిన ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. వీరిలో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా నుంచి కల్వకుంట్ల కవిత, ఉమ్మడి రంగారెడ్డి నుంచి పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్‌ రాజు ఉన్నారు. 
 
ఈ మేరకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల‌ స్థానిక సంస్థ‌ల నుంచి ఏక‌గ్రీవంగా ఎన్నికైన టీఆర్ఎస్ అభ్య‌ర్థి క‌ల్వ‌కుంట్ల క‌విత‌.. సీఎం కేసీఆర్‌కు మ‌రోసారి హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. 
 
ఎమ్మెల్సీగా ఏక‌గ్రీవంగా ఎన్నికైన క‌విత‌.. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం నిజామాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్, రిట‌ర్నింగ్ అధికారి సీ నారాయ‌ణ‌రెడ్డి నుంచి ధృవీక‌ర‌ణ ప‌త్రం అందుకున్నారు.
 
అనంత‌రం మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డితో క‌లిసి క‌విత మీడియాతో మాట్లాడారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మరోసారి ఎన్నికయ్యేందుకు సహకరించిన ప్రజాప్రతినిధులందరికీ మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. 
 
అన్ని పార్టీల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గుర్తించి, పోటీ లేకుండా టీఆర్ఎస్ అభ్యర్థిగా త‌న‌కు అవ‌కాశం క‌ల్పించారు. ఎన్నికలలో సహకరించిన ఉమ్మడి నిజామాబాద్ ‌జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరికీ క‌విత ధ‌న్య‌వాదాలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరవింద్ కృష్ణ SIT.. ఆశ్చర్యపరుస్తున్న సూపర్ హీరో లుక్

14 చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ 39 సంవత్సరాల తర్వాత చేస్తున్న కల్కి 2898 AD

దర్శన్ అభిమాని రేణుకస్వామి హత్య కేసు : వెలుగులోకి సంచలన విషయాలు

ఉస్తాద్ రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ కాంబోలో డబుల్ ఇస్మార్ట్ టైటిల్ సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

తర్వాతి కథనం
Show comments