Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిడ్ డే మీల్స్ వికటించింది .. 80 మంది విద్యార్థులకు అస్వస్థత

Webdunia
గురువారం, 28 అక్టోబరు 2021 (11:34 IST)
తెలంగాణా రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా బీర్కూరు మండల కేంద్రంలో మధ్యాహ్న భోజనం వికటించింది. ఫలితంగా 80 మంది విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. బీర్కూర్‌ మండల కేం ద్రంలో బుధవారం చోటు చేసుకుంది. 
 
స్థానిక ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాలలో రోజూ మాదిరిగానే 321 విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేశారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఒక్కొక్కరికి వాంతులు, కడుపునొప్పి ప్రా రంభమైంది. దీంతో ఉపాధ్యాయులు ఈ విషయం బయటికి పొక్కకుండా ప్రయత్నించారు. 
 
పరిస్థితి చేయిదాటి పోతుండడంతో మండల వైద్యాధికారికి రాజారమేశ్‌కు సమాచారం అందించారు. సిబ్బందితో అక్కడి చేరుకున్న ఆయన విద్యార్థులకు ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం 108 అంబులెన్స్‌లో బాన్సువాడ ఏరియా దవాఖానకు తరలించారు. విద్యార్థులంతా చికిత్స పొందుతున్నారని తహసీల్దార్‌ రాజు తెలిపారు.
 
ఈ విషయం తెలుసుకున్న ఎంపీపీ తిలకేశ్వరి రఘు, ఎస్సై రాజేశ్‌, రైతు బంధు సమితి అధ్యక్షుడు అవారి గంగారాం పాఠశాలకు చేరుకొని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పాఠశాలకు చేరుకున్న డీఎంహెచ్‌వో కల్పన భోజనం శాంపిళ్లను సేకరించాలని మండల వైద్యాధికారిని ఆదేశించారు. శాంపిళ్లను ల్యాబ్‌కు పంపిన తర్వాతే కారణాలు తెలుస్తాయన్నారు. బాధిత చిన్నారులను తెలంగాణ శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆస్పత్రికెళ్లి పరామర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments