Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూనియర్ ఆర్టిస్ట్ జ్యోతిరెడ్డి రైలు ప్రమాదంలోనే ప్రాణాలు కోల్పోయింది: పోలీసులు

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (10:00 IST)
జూనియర్ ఆర్టిస్ట్ జ్యోతి రెడ్డి మృతిపై దర్యాప్తు చేస్తున్న గవర్నమెంట్ రైల్వే పోలీసులు ప్రాధమికంగా ఓ నిర్ణయానికి వచ్చారు. రైలు కంపార్ట్‌మెంట్ మెట్లు- ప్లాట్‌ఫారమ్ మధ్య చిక్కుకోవడం వల్ల జ్యోతిరెడ్డి తీవ్రంగా గాయపడి మరణించిందని అనుమానిస్తున్నారు.

 
కడపకు చెందిన జ్యోతిరెడ్డి (28) అనే యువతి హైదరాబాద్ నగరంలో ఓ ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తూనే జూనియర్ ఆర్టిస్టుగా పని చేస్తుంది. సంక్రాంతి పండుగ కోసం సొంతూరు వెళ్లిన జ్యోతి సోమవారం రాత్రి తిరిగి హైదరాబాద్ నగరానికి పయనమైంది. 

 
ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున రైలు షాద్ నగరులో రైల్వే స్టేషన్‌లో ఆగింది. రైలు ఆగడంతో కాచిగూడ వచ్చేశామని భావించిన జ్యోతి రైలు దిగేసింది. అయితే, ఆ తర్వాత అది షాద్‌నగర్‌ అని తెలుసుకుని కంగారుపడింది. 

 
అప్పటికే రైలు కదలదడంతో రన్నింగ్ ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించి అదుపుతప్పి కిందపడిపోయింది. తీవ్రంగా గాయపడిన జ్యోతిరెడ్డిని ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ విషయం తెలిసిన జూనియర్ ఆర్టిస్టులు జ్యోతి మృతికి రైల్వే నిర్లక్ష్యమే కారణంగా ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments