Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా తండ్రి అవినీతిపరుడు... టిక్కెటి ఇవ్వొద్దు.. తెరాస ఎమ్మెల్యే కుమార్తె

Webdunia
మంగళవారం, 18 జులై 2023 (09:18 IST)
తన తండ్రి అవినీతిపరుడు అని, ఆయనకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్ ఇవ్వొద్దని జనగామ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కుమార్తె తుల్జా భవానీ రెడ్డి అంటున్నారు. గత కొంతకాలంగా తండ్రీ కుమార్తెలకు ఏమాత్రం పొసగడం లేదు. తన పేరిట ఉన్న ఆస్తులను ఫోర్జరీ సంతకాలు చేసి స్వాధీనం చేసుకున్నారంటూ తుల్జా భవానీ ఇటీవల మీడియాకు కూడా చెప్పారు. తాజాగా మరోమారు తండ్రిపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
తన తండ్రి అవినీతిపరుడని, అసలు ఆయనను ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారో తెలియదంటూ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేను ప్రశ్నించాల్సివుంది, ఓడించాల్సింది ప్రజలే అన్నారు. ప్రజల ఆస్తిని తాను తిగిరి ఇచ్చేసినట్టు చెప్పారు. తన తండ్రి నుంచి ఒక్క రూపాయి కూడా తాను తీసుకోలేదన్నారు. కుటుంబం నుంచి తనకు ఎలాంటి మద్దతు లేదన్నారు. భూకబ్జా చేసినట్టు ఒక ఎమ్మెల్యే బహిరంగగా చెప్పినప్పటికీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. ఇటువంటి అవినీతిపరులకు పార్టీ టిక్కెట్ ఇవ్వకూడదని, సొంతంగా పోటీ చేసినా సర్పంచ్‌గా కూడా తన తండ్రి విజయం సాధించలేడని ఆమె జోస్యం చెప్పారు. 
 
కేవలం సీఎం కేసీఆర్ పేరు చెప్పుకునే తన తండ్రి గత ఎన్నికల్లో గెలిచారని ఆరోపించారు. పైగా, తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి ఏమాత్రం లేదన్నారు. తనపై ఎన్నో కేసులు పెట్టి  వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. జనగామకు వెళ్లి అడిగితే తన తండ్రి గురించి ప్రతి ఒక్కరూ చెబుతారన్నారు. ఇపుడిపుడే తన తండ్రికి బాధితులు ఫోన్లు చేస్తున్నారు. బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

prasad behera arrest, నటి బ్యాక్ టచ్ చేస్తూ లైంగిక వేధింపులు

కాలికి గాయంతో జపాన్ పర్యటన రద్దు చేసుకున్న ప్రభాస్

యదార్థ సంఘటనలతో నేటివిటి కథ విడుదల-2 : చింతపల్లి రామారావు

బొప్పన టెలివిజన్ అవార్డ్స్‌లో శ్రీలక్ష్మి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ చిత్రం‘జాక్- కొంచెం క్రాక్ రిలీజ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments