అతివేగం.. స్పీడ్‌ గన్‌కు చిక్కిన కలెక్టర్ వాహనం - 23 చలాన్లు

Webdunia
మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (10:43 IST)
తెలంగాణా రాష్ట్ర ట్రాఫిక్ పోలీసులు విధుల్లో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలు ఎవరికైనా ఒక్కటేనని మరోమారు నిరూపించారు. నిబంధనలు అతిక్రమించిన వారికి వారికి జరిమానాలు విధించడంలో ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. అధి సాధారణ పౌరుడైనా.. జిల్లా కలెక్టర్ అయినా సరే.. అంతా సమానమేనని రుజువు చేస్తున్నారు. 
 
తాజాగా అధిక వేగంతో వెళ్తూ స్పీడ్​ గన్​కు చిక్కిన ఓ ఉన్నతాధికారి వాహనానికి ఏకం 23 చలాన్లు పడ్డాయి. వివరాల్లోకి వెళ్తే… జనగామ కలెక్టర్ ప్రభుత్వ వాహనానికి గడిచిన రెండేళ్లలో ఏకంగా 23 సార్లు జరిమానాలు పడ్డాయి. వీటిలో 22సార్లు ఓవర్ స్పీడ్‌కు కాగా… ఒకసారి ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద జీబ్రా క్రాసింగ్ చేసినందుకు చలానాలు విధించారు. 
 
ఈ చలానాల మొత్తం రూ.22,100 కాగా.. యూజర్ ఛార్జీలు రూ.805 కలుపుకొని మొత్తం 22,905 కట్టాల్సి ఉంది. ఈ చలానాల్లో సగానికి పైగా హైదరాబాద్‌ రింగ్ రోడ్డుపై ఓవర్‌ స్పీడ్‌తో వెళ్లినందుకే విధించారు.
 
రోడ్డు ప్రమాదాల నివారణ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న పోలీసులు.. కలెక్టర్‌ వాహనంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అధికారుల వాహనాలపై కూడా చర్యలు తీసుకోవాలని, నియమ నిబంధనలు పాటించడంలో ప్రజలకు మార్గదర్శకంగా నిలవాలని నెటిజన్లు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

Rajiv: లవ్ ఓటీపీ..లో కొడుకుని కూతురిలా చూసుకునే ఫాదర్ గా రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments