Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్టీని గెలిపించిన వారే బాహుబలి అవుతారు: రేవంత్ రెడ్డిని అవమానించిన జానారెడ్డి?

తెలంగాణ తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నేతలు సాదరంగా స్వాగతం పలుకుతున్నారు. కొడంగల్ ప్రాంతానికి చెందిన నేతలు రేవంత్ రెడ్డి కాంగ్రె‌స్‌లో చేరడంపై అసంతృప్తితో

Webdunia
గురువారం, 2 నవంబరు 2017 (17:57 IST)
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నేతలు సాదరంగా స్వాగతం పలుకుతున్నారు. కొడంగల్ ప్రాంతానికి చెందిన నేతలు రేవంత్ రెడ్డి కాంగ్రె‌స్‌లో చేరడంపై అసంతృప్తితో వున్నప్పటికీ వారికి టిక్కెట్లు ఇచ్చే దిశగా పార్టీ సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 
 
గతంలో తమ పార్టీలోకి ఓ బాహుబలి వస్తారని వ్యాఖ్యానించిన జానారెడ్డి.. ప్రస్తుంత రేవంత్ పార్టీలో చేరడంపై స్పందించారు. తమ పార్టీలో చేరగానే ఎవరూ బాహుబలి కారని, పార్టీని గెలిపించిన వారే నిజమైన బాహుబలి అనిపించుకుంటారని వ్యాఖ్యానించారు. అలాగే కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి చేరికను తాము స్వాగతిస్తున్నామని రఘువీరా తెలిపారు. ఆయన తమకు బయటి వ్యక్తి కాదని, మాజీ కేంద్రమంత్రి, తెలంగాణ కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డికి స్వయానా అల్లుడు అని చెప్పుకొచ్చారు. 
 
కాగా..  తెలంగాణ తెలుగుదేశం మాజీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మంగళవారం ఉదయం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఢిల్లీలోని నివాసంలో కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ.. రేవంత్‌కు మూడు రంగుల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రేవంత్‌తోపాటు మరికొందరు నేతలకు కూడా రాహుల్‌ కండువాలు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు. 
 
అయితే జానారెడ్డి రేవంత్ రెడ్డి అవమానించారని.. పార్టీలో చేరినంత మాత్రాన ఎవ్వరూ బాహుబలి కాలేరని.. పార్టీని గెలిపించే సత్తా వుండాలనే విషయాన్ని రేవంత్ రెడ్డికి వుండాలనే విషయాన్ని గుర్తు చేసేందుకు అలాంటి వ్యాఖ్యలతో పరోక్షంగా దెప్పిపొడిచారని రాజకీయ పండితులు అంటున్నారు. మరి పార్టీలో చేరిన గంటల్లో మొదలైన సీనియర్ల అసంతృప్తి వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments