Webdunia - Bharat's app for daily news and videos

Install App

''ఇతడే నిజమైన బాహుబలి'' కేటీఆర్ ట్వీట్.. ఇంతకీ ఆయనెవరు?

తమిళనాడులోని ఫారెస్ట్ గార్డు శరత్ కుమార్‌పై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. గుంటలో పడిపోయిన ఏనుగు పిల్లను రక్షించి దానిని తన తల్లి వద్దకు చేర్చిన శరత్ కుమార్‌ను ప్రశంసిస్తూ కేటీఆర్ తన

Webdunia
ఆదివారం, 31 డిశెంబరు 2017 (18:55 IST)
తమిళనాడులోని ఫారెస్ట్ గార్డు శరత్ కుమార్‌పై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. గుంటలో పడిపోయిన ఏనుగు పిల్లను రక్షించి దానిని తన తల్లి వద్దకు చేర్చిన శరత్ కుమార్‌ను ప్రశంసిస్తూ కేటీఆర్ తన ట్విట్టర్లో "ఇతడే నిజమైన బాహుబలి" అంటూ ట్వీట్ చేశారు. తిండిలేక నీరసించిపోయిన ఓ ఏనుగు పిల్ల గుంటలో పడిపోవడంతో దానిని కాపాడమంటూ ఏనుగు తల్లి ఆ రోడ్డుపైనే బైఠాయించింది. 
 
ఏనుగు పిల్లను కాపాడేందుకు ఫారెస్ట్ గార్డు తన సహచర ఉద్యోగులతో కలిసి శ్రమించి దానిని కాపాడారు. ఈ ఘటన హిల్ స్టేషన్ ఊటీకి యాభై కిలోమీటర్ల దూరంలో ఉండే మెట్టుపాళ్యంలో చోటుచేసుకుంది. రోడ్డుపైనే వున్న తల్లి ఏనుగును తరిమికొట్టినా అది అక్కడ నుండి కదల్లేదు. ఆపై  సహచర ఉద్యోగులతో కలిసి ఆ ప్రాంతంలో వెతికే సరికి.. చిన్న ఏనుగు పిల్ల గుంతలో పడి వుండటాన్ని గమనించామని శరత్ కుమార్ చెప్పారు. 
 
గుంతలో నుంచి దాన్ని రక్షించి.. వేరే మార్గం ద్వారా రోడ్డుపై వచ్చి.. దాని తల్లి వద్దకు వదిలిపెట్టాం. మరుసటి రోజు వెళ్లి చూస్తే ఆ రెండు ఏనుగులు  సురక్షితంగా అడవుల్లోకి వెళ్లినట్లు గల పాదాల గుర్తులు గమనించాం. నలుగురు కలసి ఆ  పిల్ల ఏనుగును మోసకొచ్చే ప్రయత్నం చేశామని శరత్ తెలిపారు.

ఒకవేళ తల్లి ఏనుగు కనుక దాడి చేస్తుందేమోననే భయపడ్డాం. కానీ తానొక్కడినే తన భుజాలపై మోశాను. తన సహచరులు బ్యాలెన్స్ కోల్పోకుండా తనకు సహకరించారు. అంత బరువున్న ఆ ఏనుగు పిల్లను ఎత్తిన ఫారెస్ట్ గార్డు దృశ్యాలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments