Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెల్లెమ్మా నీ కృషి అభినందనీయం... టీబీజీకేఎస్ ఫలితాలపై కేటీఆర్ ట్వీట్

తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి బొగ్గు గనుల గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అనుబంధ విభాగమైన టీబీజీకేఎస్ (తెలంగాణ బొగ్గు గనుల కార్మిక సంఘం) విజయఢంకా మోగించింది.

Webdunia
శుక్రవారం, 6 అక్టోబరు 2017 (14:05 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి బొగ్గు గనుల గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అనుబంధ విభాగమైన టీబీజీకేఎస్ (తెలంగాణ బొగ్గు గనుల కార్మిక సంఘం) విజయఢంకా మోగించింది. శుక్రవారం వెల్లడైన పూర్తి ఫలితాల్లో మొత్తం 11 డివిజన్లకు గాను ఈ సంఘం ఏకంగా 9 డివిజన్లలో గులాబీ జెండా ఎగురవేసింది. విపక్ష పార్టీలన్నీ కలిసి పోటీ చేసినా తెరాస గెలుపును అడ్డుకోలేకపోయాయి. 
 
ఈ సందర్భంగా టీబీజీకేఎస్ గెలుపులో కీలక పాత్ర పోషించిన టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు, ఎంపీ కవితను మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా అభినందించారు. అనైతికంగా కూటమిని ఏర్పాటు చేసి ప్రతిపక్ష పార్టీలు చేసిన కుట్రలు టీబీజీకేఎస్ గెలుపును ఏమాత్రం ఆపలేకపోయాయని కేటీఆర్ ట్వీట్ చేశారు. 
 
అలాగే, ఈ ఎన్నికల ఫలితాలపై నిజామాబాద్ ఎంపీ, కేటీఆర్ చెల్లెలు కె.కవిత మాట్లాడుతూ... టీబీజీకేఎస్ గెలుపుతో తమ బాధ్యత మరింత పెరిగిందన్నారు. సీఎం కేసీఆర్ మీద విశ్వాసంతో కార్మికులు టీబీజీకేఎస్‌ను గెలిపించారన్నారు. టీబీజీకేఎస్‌కు అపూర్వ విజయాన్ని కట్టబెట్టిన కార్మికులకు కవిత కృతజ్ఞ‌తలు తెలియజేశారు. 
 
సీఎం కేసీఆర్ నాయకత్వంలో కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. కార్మికుల మనసు గెలుచుకునేలా పనిచేస్తామన్నారు. కార్మికులకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 9 డివిజన్లను గెలుచుకున్నామని ఆమె ఈ సందర్భంగా చెప్పారు.


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

Nidhhi Agerwal: నేను హీరోతో డేటింగ్ చేయకూడదు.. నిధి అగర్వాల్ చెప్తున్నందేంటి.. నిజమేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments