కేసీఆర్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు... ఢిల్లీ వరకూ వెళ్లింది...
బతుకమ్మ పండుగకు తెలంగాణ పంపిణీ అయిన చీరల వ్యవహారం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు అందరికీ చీరలు ఇస్తున్నామని చెప్పిన తెలంగాణ సర్కారు... చేనేత చీరలకు బదులు పాలిస్టర్ చీరలను పంపిణీ చేస్తోందని ప్రజలే వ్యాఖ్యానిస్త
బతుకమ్మ పండుగకు తెలంగాణ పంపిణీ అయిన చీరల వ్యవహారం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు అందరికీ చీరలు ఇస్తున్నామని చెప్పిన తెలంగాణ సర్కారు... చేనేత చీరలకు బదులు పాలిస్టర్ చీరలను పంపిణీ చేస్తోందని ప్రజలే వ్యాఖ్యానిస్తున్నారు. నాసిరకం చీరల్ని చూపిస్తూ మహిళలు ఏకంగా సీఎం కేసీఆర్‌నే నిలదీస్తున్నారు. ఓ మహిళ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి భార్య కానీ ఆయన కుమార్తె కానీ ఈ చీర కట్టుకుని బతుకమ్మ పండుగ చేసుకుంటారా అని ప్రశ్నించారు.
మరోవైపు తెలంగాణలో విపక్షాలన్నీ ప్రభుత్వం పంపిణీ చేసిన చీరలపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. భాజపా అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ ఎంతో గొప్పలు చెప్పుకుంటూ పంపిణీ చేసిన చీరల పంపిణీ అట్టర్ ప్లాప్ అయ్యిందనీ, మహిళలకు చీర ఆశ చూపి అవమానపరిచారంటూ మండిపడ్డారు.
చీరల కోసం క్యూ లైన్లో గంటల తరబడి నిలబడిన మహిళలు ఆ చీరను చూసి షాక్ తింటున్నారనీ, చీరల పంపిణీతో ప్రభుత్వంలో జరిగిన అవినీతి ఇలా బహిర్గతం అయిందని అన్నారు. కేసీఆర్ ఈ విషయంలో రెడ్ హ్యాండెడ్ గా చిక్కినట్లేననీ, ఈ కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ సర్దుకునే ధోరణికి స్వస్తి చెప్పి కుంభకోణంపై దృష్టి సారించాలని అన్నారు.