Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇలాగైతే చాలామంది పార్టీ వీడడం ఖాయం.. వి.హనుమంతరావు

Webdunia
బుధవారం, 4 సెప్టెంబరు 2019 (20:16 IST)
నిర్మొహమాటంగా మాట్లాడ్డంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావుకు పెట్టింది పేరు. ఎవరేమనుకున్నా ఆయన కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేస్తారు. అలాంటి నేత తాజాగా తన పార్టీ అధిష్టానానికి హెచ్చరికలు పంపారు.

పీసీసీ అధ్యక్షుడిగా ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలను నియమించారని కొంతమంది ప్రచారం చేస్తున్నారని, అలాచేస్తే అనేకమంది పార్టీని వీడిపోతారని ఆ పార్టీ మాజీ ఎంపీ వీ హనుమంతరావు  స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో తనకు అన్యాయం జరిగిందని అన్నారు.

పార్టీలో ఆయారాం, గయరాం వంటి వారికే కీలక పదవులు ఇస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. . కాంగ్రెస్‌లో ఓడిపోయిన వాళ్లకు ఎంపీ టికెట్‌లు ఇస్తున్నారని, నేతల బ్యాక్‌గ్రౌండ్‌ చూసి పదవులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

తెలంగాణలో అపరిశుభ్ర వాతావరణంతో రోగాలు ప్రబలుతున్నాయని, భారీ సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని వీహెచ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌ నుంచి బయటకు వచ్చి ప్రజల పరిస్థితిని చూడాలని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments